ETV Bharat / city

ఏపీ ముఖ్యమంత్రి జగన్​కు చంద్రబాబు లేఖ - chandrababu letter to jagan

ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత, తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. కరోనాా వేళ రాష్ట్రంలో అనుసరిస్తున్న విధానాలపై లేఖలో ప్రస్తావించారు.

chandrababu-letter-to-cm-jagan
chandrababu-letter-to-cm-jagan
author img

By

Published : Apr 2, 2020, 8:55 PM IST

రాష్ట్రంలో కరోనా తీవ్రత, నిర్ధరణ పరీక్షలు, పాజిటివ్ కేసులు గుర్తించటం, కరోనా చికిత్స చర్యలు, అన్న క్యాంటీన్లు తెరవటం వంటి ఐదు అంశాలపై తెదేపా అధినేత చంద్రబాబు... సీఎం జగన్​కు లేఖ రాశారు. కరోనా వైరస్ మహమ్మారి.. ప్రపంచాన్ని అతలాకుతం చేస్తోందన్న చంద్రబాబు... రాష్ట్రంలో కొవిడ్ 19 కేసులు విపరీతంగా పెరిగిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా విస్తరిస్తోన్న వేళ నియంత్రణ చర్యలు కట్టుదిట్టం చేయాలని సీఎం జగన్​ను కోరారు. సమస్యను అంత తేలిగ్గా తీసుకోరాదని సూచించారు. రెండో ప్రపంచ యుద్ధం కన్నా కరోనా పెను సంక్షోభమని ఐరాస పేర్కొందని చంద్రబాబు అన్నారు. కరోనా కట్టడికి ఇతర రాష్ట్రాలు, దేశాలు చేపట్టిన చర్యలను నిశితంగా అధ్యయనం చేయాలన్నారు.

అన్న క్యాంటీన్లు తెరిచి పేదల ఆకలి తీర్చండి: చంద్రబాబు

రాష్ట్రంలో కరోనా టెస్టింగ్ ల్యాబ్​లు పెంచాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటివరకు 1,307 పరీక్షలు మాత్రమే చేశారన్నారు. ఎన్ని ఎక్కువ పరీక్షలు చేస్తే అంతగా కరోనాను కట్టడి చేయవచ్చని అభిప్రాయపడ్డారు. పేదలు పస్తులుండకుండా 'అన్న క్యాంటీన్లు' తెరిచి ఆదుకోవాలని సూచించారు. వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి రక్షణ ఉపకరణాలు అందజేయాలన్న చంద్రబాబు... ప్రభుత్వ ఉద్యోగులు, ఒప్పంద, పొరుగుసేవల సిబ్బంది జీతాల్లో కోత పెట్టవద్దని కోరారు. పింఛన్లలో కోత పెట్టడం సరికాదని చెప్పారు. కరోనా వ్యాప్తిపై ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు. వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలని కోరారు. అనేక రాష్ట్రాలు, దేశాలు ఉద్యోగులకు ప్రోత్సాహకాలు అందిస్తుంటే.. రాష్ట్రంలో వేతనాల్లో కోత పెట్టడం బాధాకరమన్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో మరో 24 మందికి కరోనా​.. 135కు చేరిన పాజిటివ్ కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.