ETV Bharat / city

ప్రకృతి అందాలకు నెలవు.. వంజంగి కొండల్లోని కొత్తవలస గుహలు..

విశాఖలోని మన్యం ప్రకృతి అందాలకు నెలవు. పచ్చదనం సోయగాలు.. పక్షుల కిలకిలారావాలు పర్యటకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. జలపాతాలు, ప్రకృతి రమణీయ ప్రకృతి ప్రేమికులను అలరిస్తున్నాయి. పర్యటకులను ఎంతగానో అలరింపజేస్తోన్న వంజంగి కొండల్లోని గుహల గురించి అక్కడి స్థానికుల మాటల్లో తెలుసుకుందామా!

author img

By

Published : Nov 2, 2020, 2:55 PM IST

caves-in-vanjangi-hills-in visakha-district
వంజంగి కొండల్లోని కొత్తవలస గుహలు

ఏపీలోని విశాఖ ఏజెన్సీకి 3,300 అడుగుల ఎత్తులో అనేక కొండలు ఉన్నాయి. మరెన్నో అందాలు కొండలపై భాగంలో దర్శనమిస్తాయి. ఇటీవల వంజంగి కొండ ప్రాంతానికి పర్యటకుల తాకిడి పెరిగింది. దీనికి సమీపంలో ఉన్న కొత్తవలస గ్రామంలో మూడు గుహలున్నాయి. అక్కడికి రహదారి సౌకర్యం కల్పిస్తే.. పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని గిరిజనులు అంటున్నారు. దీనివల్ల వారికి ఉపాధి ఏర్పడి ఆదాయ మార్గం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

వంజంగి కొండల్లోని కొత్తవలస గుహలు

రోడ్డు సౌకర్యం లేక వంజంగి కొండ ప్రాంతంలో నివసించే ప్రజల కష్టాలను వివరిస్తూ 'రహదారి లేక డోలి కష్టాలు' అనే శీర్షికన ఈటీవీ ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణం చేపట్టారు. దీంతో ఆ గిరిజనులకు కొంత ఊరట లభించింది. ఇటీవల ఈ మార్గంలో ప్రారంభమవటంతో పర్యాటకులు వెళ్లి కొండ అందాలను చూసి మురిసిపోతున్నారు. శీతాకాలం మొదలవటంతో మంచుకురిసి కొండలను కమ్మేసింది. ఒకవైపు పచ్చదనం, మరోవైపు సూర్యకిరణాల తాకిడికి ముత్యంలా మెరిసే మంచు చూపరులను మంత్రముగ్ధులను చేస్తోంది.

గుహల వద్దకు కొత్తవలస ఎస్​ కొత్తూరు గ్రామస్థులు, యువకులు, బాలురు వచ్చి సందడి చేశారు. విశాలమైన ఓ గుహ ద్వారం వద్ద డాన్స్ చేశారు. ఎత్తైన కొండ పైభాగం నుంచి చుట్టూ చూస్తే ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. ప్రస్తుతం పర్వతారోహణ చేసేవాళ్లు మాత్రమే గుహలు సందర్శిస్తున్నారు. పాడేరు మండలం నుంచి జి.మాడుగులలోని వంతల వరకు రహదారిని నిర్మిస్తే, మార్గం మధ్యలో ఉన్న ఈ గుహలకు చేరుకునేందుకు సులువవుతుందని గిరిజనులు చెబుతున్నారు. వీటిని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సహకరించాలని స్థానికులు కోరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.