ETV Bharat / city

కొంతకాలంగా కంటోన్మెంట్ అభివృద్ధికి పరుగులు : సాయన్న - కమ్యూనిటీ హాల్​కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే సాయన్న

గత కొంతకాలంగా అభివృద్ధిలో కంటోన్మెంట్ పరుగులు పెడుతోందని ఎమ్మెల్యే సాయన్న అన్నారు. నియోజకవర్గం పరిధిలోని కార్ఖానాలో నూతన కమ్యూనిటీ హాల్​ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

cantonment mla sayanna laid foundation stone for community hall in karkhana
కొంతకాలంగా కంటోన్మెంట్ అభివృద్ధికి పరుగులు: ఎమ్మెల్యే సాయన్న
author img

By

Published : Jan 31, 2021, 3:22 PM IST

సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తున్నట్టు స్థానిక ఎమ్మెల్యే సాయన్న తెలిపారు. నియోజకవర్గం పరిధిలోని కార్ఖానాలో నూతన కమ్యూనిటీ హాల్​ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కొంతకాలంగా అభివృద్ధి పనులతో కంటోన్మెంట్ పరుగులు పెడుతోందని పేర్కొన్నారు.

కమ్యూనిటీ హాల్​ కోసం అవసరమైతే ఎమ్మెల్యే నిధుల నుంచి పది లక్షలు కేటాయిస్తానన్నారు. ఈ భవనం పేదలకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఎల్లప్పుడూ ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్​ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి, కార్పొరేటర్ అనితా ప్రభాకర్​, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ట్రామాకేర్ సెంటర్‌గా శామీర్‌పేట్ ఆస్పత్రి : ఈటల

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.