హైదరాబాద్ అంబర్పేట్ పరిధిలోని రాచకొండ పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్‌లో పోలీసు సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన క్యాంటీన్, వాలీబాల్ కోర్టు, మహిళా పోలీసుల కోసం షటిల్ కోర్టును సీపీ మహేశ్ భగవత్ ప్రారంభించారు. హెడ్ క్వార్టర్స్‌లో దాదాపు 1000 మంది సిబ్బంది సేవలందిస్తుంటారని సీపీ తెలిపారు. వారికి ఇబ్బంది కలగకూడదని క్యాంటీన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పోలీసు సిబ్బంది దృఢంగా ఉండటం కోసం వాలీబాల్, షటిల్ కోర్టులు నిర్మించినట్లు వెల్లడించారు.

క్యాంటీన్లో అందజేసే ఆహారం నాణ్యతతో కూడి ఉండేలా చర్యలు తీసుకున్నట్లు సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం టాటా ఏరోస్పేస్ సహకారంతో బోట్లు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కమిషనరేట్‌లో పోలీసు సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్నిరకాల వసతులు కల్పిస్తున్నట్లు వెల్లడించారు.

- ఇదీ చదవండి : 'అత్యంత వేగంగా వ్యాపిస్తున్న డెల్టా వేరియంట్'