ETV Bharat / city

కృష్ణా జలాల వివాదంపై బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్‌లో విచారణ

తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జిలాల వివాదం రగులుతూనే ఉంది. బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్ ఈ సమస్యపై విచారణ చేపట్టింది. తెలంగాణకు ఎక్కువ నీటిని కేటాయించాల్సిన అవసరాన్ని పేర్కొంటూ.. సీడబ్ల్యూసీ మాజీ ఛైర్మన్‌ ఘనశ్యామ్​ సాక్షిగా అఫిడవిట్‌ దాఖలు చేశారు. ఆయనను ఇవాళ ఏపీ తరఫు న్యాయవాది క్రాస్​ ఎగ్జామినేషన్​ చేశారు.

కృష్ణా జలాల వివాదంపై బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్‌లో విచారణ
కృష్ణా జలాల వివాదంపై బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్‌లో విచారణ
author img

By

Published : Mar 19, 2021, 4:35 PM IST

కృష్ణా జలాల వివాదం పరిష్కారానికి బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ ఏర్పాటైంది. తెలుగు రాష్ట్రాల వాదనలపై ట్రైబ్యునల్ విచారణ చేపట్టింది. తెలంగాణకు ఎక్కువ నీటిని కేటాయించాల్సిన అవసరాన్ని పేర్కొంటూ దాఖలైన ఓ అఫిడవిట్​కు సంబంధించి వాదనలు జరుగుతున్నాయి. ఛైర్మన్ బ్రిజేశ్‌కుమార్ ధర్మాసనం ముందు విచారణ జరిగింది. తెలంగాణ తరపున సాక్షిగా ఉన్న సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ ఘన్ శ్యామ్​ను ఏపీ ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. కరోనా, న్యాయమూర్తి రాజీనామా కారణంగా దాదాపు ఏడాదిన్నర తర్వాత బ్రిజేష్ కుమార్ ట్రైబ్యూనల్ బుధవారం విచారణ ప్రారంభించింది.

బుధ, గురు శుక్రవారాల్లో కొనసాగిన క్రాస్ ఎగ్జామినేషన్​లో నాగర్జున సాగర్ ప్రాజెక్టు, కేసీ కెనాల్, పోలవరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన పట్టిసీమ ఎత్తిపోతలపై ప్రశ్నలకు ఘన్​శ్యామ్ సమాధానం ఇచ్చారు. శుక్రవారం జరిగిన క్రాస్ ఎగ్జామినేషన్​లో పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే వరకు కృష్ణా డెల్టాకు నీరందించేందుకు నిర్మించిన పట్టిసీమ ఎత్తిపోతల పథకంపై క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది. తదుపరి క్రాస్ ఎగ్జామినేషన్​ను వచ్చే నెల 28, 29, 30 తేదీలకు వాయిదా వేస్తున్నట్లు బ్రిజేష్ కుమార్ తెలిపారు.

ఇదీ చదవండి: ఇది ప్రజాకర్షక బడ్జెట్.. అన్నివర్గాలకు న్యాయం: పువ్వాడ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.