రాజధాని అంశంపై బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఆంధ్రప్రదేశ్ సీఎంకు నివేదిక సమర్పించింది. రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై బీసీజీ కమిటీ అధ్యయనం చేసింది. రాజధానిపై ఇప్పటికే జీఎన్‌రావు కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ రెండు నివేదికలపై అధ్యయనానికి ఈనెల 6న ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ తొలిసారి భేటీ కానుంది. 8న జరిగే మంత్రివర్గ సమావేశంలోనూ బీసీజీ నివేదికపై ప్రభుత్వం చర్చించే అవకాశముంది. వీటిపై అధ్యయనం తర్వాత 3 వారాల్లోగా హైపవర్ కమిటీ తన తుది నివేదికను ప్రభుత్వానికి అందజేయనుంది.

ఇవీ చూడండి : సిరిసిల్లలో 'షాపర్స్ స్టాప్' దుస్తుల తయారీ కేంద్రం