ETV Bharat / city

అమరావతి అసాధ్యం.. తేల్చిన బోస్టన్ నివేదిక - అమరావతిపై బోస్టన్ కమిటీ నివేదిక

అమరావతిని ఏపీ రాజధానిగా అభివృద్ధి చేయడం ఆర్థికంగా భారమే అవుతుందని బోస్టన్‌ కమిటీ నివేదిక వెల్లడించింది. పెట్టుబడులు-రాబడి అనే కోణంలో అమరావతి నిర్మాణం రాష్ట్రంపై ఆర్థిక భారం మరింత పెరుగుతుందని తేల్చి చెప్పింది. అమరావతిపై ఖర్చు చేసే మొత్తాన్ని... ఇతర ప్రాంతాలపై వెచ్చిస్తే బాగుంటుందని కమిటీ సూచించింది.

boston-committee-has-said-amaravathi-is-not-financial-good-for-ap
అమరావతి అసాధ్యం.. తేల్చిన బోస్టన్ నివేదిక
author img

By

Published : Jan 4, 2020, 6:26 AM IST

Updated : Jan 4, 2020, 7:06 AM IST

అమరావతి అసాధ్యం.. తేల్చిన బోస్టన్ నివేదిక

అమరావతి దార్శనికపత్రంలో పేర్కొన్న లక్ష్యాలను చేరుకోవాలంటే రూ.1.10 లక్షల కోట్లు అవసరమవుతాయని బోస్టన్‌ కమిటీ నివేదిక తెలిపింది. అంత మొత్తాన్ని ఒకే నగరంలో పెట్టడం అవసరమా? అనేది ఆలోచించాలని... ఏపీలో అమరావతి నిర్మాణానికి రుణం తీసుకొస్తే ఏటా పది వేల కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సి ఉంటుందని పేర్కొంది. పెట్టుబడులు- రాబడి కోణంలో ఇది ఆర్థిక భారమేనని వెల్లడించింది. అమరావతి భూములు అమ్మకం ద్వారా వచ్చే నిధులు సరిపోవని.. 40 ఏళ్ల తర్వాత వచ్చే రాబడి కోసం ఇప్పుడింత పెట్టుబడి అవసరం లేదని అభిప్రాయపడింది.

పరిపాలన వికేంద్రీకరణ మంచిదే..!

అమరావతిపై పెట్టే లక్ష కోట్ల రూపాయలను నీటి పారుదలపై ఖర్చు చేస్తే మంచి ఫలితాలొస్తాయని బీసీజీ నివేదిక పేర్కొంది. సచివాలయానికి వచ్చిన ఓ లక్ష మంది పౌరుల సగటు పనిని మదింపు చేసిన కమిటీ పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా శాటిలైట్‌ కమిషనరేట్‌లు ఏర్పాటు చేయాలని సూచించింది. వీటి ద్వారా ప్రజలపై ఖర్చు తగ్గించడంతోపాటు.. వారికి సత్వర సేవలు అందించే సౌకర్యం ఉంటుందని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం వార్డు, గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసినందున ఫలితాలు మెరుగవుతాయని కమిటీ అభిప్రాయపడింది.

6 శాటిలైట్ కమిషనరేట్లు

  • శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలకు
  • ఉభయగోదావరి జిల్లాలకు
  • కృష్ణా-గుంటూరు జిల్లాలకు
  • ప్రకాశం-నెల్లూరు జిల్లాలకు
  • చిత్తూరు-కడప జిల్లాలకు
  • అనంతపురం-కర్నూలు జిల్లాలకు

అప్పులో ఊబిలో రాష్ట్రం

ఇప్పటికే రెండున్నర లక్షల కోట్ల అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రానికి భారీగా పెట్టుబడి పెట్టే స్థోమత లేదని నివేదిక తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా కొత్తగా నిర్మించిన నగరాలతోపాటు 32 గ్రీన్‌ఫీల్డ్ సిటీలను పరిశీలించామని బీసీజీ చెప్పింది. చైనాలోని షాంఘై, భారతదేశంలోని నవీ ముంబయి మినహా మరే నగరం సఫలం కాలేదని ఆ ఫలితాలను నివేదికలో పొందుపరిచింది.

sample description
Last Updated : Jan 4, 2020, 7:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.