Bandi sanjay Comments: జనగామలో తెరాస కార్యకర్తల దాడిలో గాయపడిన భాజపా కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లిన సంజయ్.. అక్కడ చికిత్స పొందుతున్న కార్యకర్తల అరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. పోలీసుల సమక్షంలో తెరాస నేతలు భాజపా కార్యకర్తలపై దాడి చేసినా.. ఎలాంటి కేసులు పెట్టలేదని బండి సంజయ్ మండి పడ్డారు. ముఖ్యమంత్రి పర్యటన పేరుతో జనగామ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమ కార్యకర్తలను రాత్రికి రాత్రి ఉస్మానియాకు తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసులంటే భయం ఏర్పడింది..
"సీఎం పర్యటన పేరిట తమ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ప్రశాంత వాతావరణంలో నిరసన తెలుపుతున్న భాజపా కార్యకర్తలపై పోలీసుల సమక్షంలోనే తెరాస నేతలు దాడి జరిపారు. ఈ దాడిలో భాజపా కార్యకర్తలు చాలా మంది.. తీవ్ర గాయాలపాలయ్యారు. గతంలో ఏదైనా కష్టం వస్తే పోలీస్ స్టేషన్కు వెళ్తే న్యాయం జరుగుతుందనే నమ్మకముండేదని.. ఇప్పుడు ప్రజల్లో భయం ఏర్పడింది. సీఎంవో డైరెక్షన్లో కొంత మంది పోలీసు అధికారుల అవలంభిస్తోన్న తీరు ఆందోళనకరంగా మారింది. ఇది కల్వకుంట్ల రాజ్యాంగం."
- బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
ఇదీ చూడండి: