విప్లవాత్మక మార్పులు తీసుకువస్తామంటూ... వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిపివేసి ధరణి పోర్టల్ తీసుకురావడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతోందని భాజపా సీనియర్ నేత మురళీధర్ రావు ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా 142 రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సేవలు నిలిచిపోవడం వల్ల... స్టాంప్ వెండర్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
దొంగ రిజిస్ట్రేషన్లు చేసుకునేవారికి ధరణి పోర్టల్ స్వర్గధామంగా మారిందని మురళీధర్ రావు విమర్శించారు. కార్డు ద్వారా రిజిస్ట్రేషన్ కొనసాగిస్తామని చెప్పిన ప్రభుత్వం... ధరణితోనే కొనసాగిస్తూ హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చిందని మండిపడ్డారు. ధరణి పోర్టల్ పట్ల తహసీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్ర్లకు కనీసం ఒక రోజు కూడా శిక్షణ ఇవ్వలేదని... అలాంటప్పుడు అవగాహన లేకుండా ఎలా పనిచేస్తారని ప్రశ్నించారు. ధరణిని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: '2023లో అధికారంలోకి వచ్చేందుకు ఈ ఎన్నికలే మార్గం'