BJP Rally in Hyderabad: రెండు పడకగదుల ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న స్థానికులకు తక్షణమే ఇళ్లు కేటాయించాలని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్‌కు చిత్తశుద్ధి లేకపోవడం వల్లే మల్లాపూర్‌లో నిర్మించే రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం అసంపూర్తిగా ఉందని ఆరోపించారు. ఈసీఐఎల్ రాధికా థియేటర్ ప్రధానకూడలి నుంచి కాప్రా మున్సిపల్ కార్యాలయం వరకు ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ నేతృత్వంలో భాజపా నాయకులు, శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. పలు చోట్ల రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం పూర్తైనా.. పేదలకు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్లు కేటాయించే వరకు తమ పోరాటం ఆగదని.. మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
"నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు.. ప్రధానమంత్రి ఆవాస్యోజనను అమలుచేయాలని నా నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ స్థలాలను అప్పటి కలెక్టర్‌తో పాటు అధికారులతో సర్వే చేపించాం. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి ఆయా స్థలాలు పూర్తిగా అనువైనవని ప్రభుత్వానికి నివేదిక అందించాం. సీఎం కేసీఆర్, కేటీఆర్‌కు చిత్తశుద్ధి లేకపోవటం వల్లనే మల్లాపూర్‌లో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాకుండా అలాగే ఉన్నాయి. కొన్ని చోట్ల నిర్మాణాలు పూర్తయినా ఇంకా ఎవ్వరికి కేటాయించలేదు ఎందుకు..?"
- ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు
ఇదీ చూడండి: