ETV Bharat / city

కమీషన్ల కోసమే ఆ చట్టాలను కేసీఆర్ వ్యతిరేకిస్తున్నారు: లక్ష్మణ్

ప్రభుత్వాని ఖజానాకు డబ్బులు రావనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్... కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో తెరాసను ఓడిస్తామని... ఆ దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు.

bjp-leader-laxman-on-ghmc-and-dubbaka-elections
రానున్న ఎన్నికల్లో విజయం భాజపాదే: లక్ష్మణ్
author img

By

Published : Oct 8, 2020, 1:19 PM IST

కమీషన్ల కోసమే కేసీఆర్‌ వ్యవసాయ, విద్యుత్‌ చట్టాలను వ్యతిరేకిస్తున్నారని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ విమర్శించారు. దేశవ్యాప్తంగా బీసీల మద్దతును కూడగట్టి భాజపా అధికారంలో లేని రాష్ట్రాల్లో... అధికారంలోకి తీసుకొస్తామని లక్ష్మణ్‌ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రోస్టర్​ విధానంలో మార్పులు తీసుకొచ్చి... బలహీనవర్గాలకు రుణాలు ఇచ్చి తోడ్పాటును అందించిందన్నారు. బిహార్, బంగాల్​ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు.

రానున్న ఎన్నికల్లో అధిక సంఖ్యలో మెజార్టీ సాధిస్తాం: లక్ష్మణ్

ప్రభుత్వ ఖజానాకు డబ్బులు రావనే... కేసీఆర్ వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారని లక్ష్మణ్ ఆరోపించారు. దుబ్బాక, జీహెచ్​ఎంసీ, పట్టభద్రుల ఎన్నికల్లో భాజపా అధిక సంఖ్యలో మెజార్టీని సాధిస్తుందని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: 'ఇది ఓ ప్రజా ఉద్యమం- అంతిమ విజయం మనదే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.