ఎంఐఎంకు తెరాస ప్రభుత్వం తొత్తుగా వ్యవహరిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కేవలం ఓట్ల కోసం ఎంఐఎంకు తెరాస ప్రభుత్వం కొమ్ము కాస్తూ... ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. హైదరాబాద్‌లోని సనత్‌నగర్, అమీర్‌పేట డివిజన్ అభ్యర్థులు అన్నపూర్ణ, సరళకు మద్దతుగా బండి సంజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
గ్రేటర్ ఎన్నికల్లో భాజపా అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ ప్రచారంలో భాజపా నాయకులు మోత్కుపల్లి నర్సింహులు, ఆదినారాయణరెడ్డి రోడ్‌షో నిర్వహించారు. హైదరాబాద్‌లో పీవీ నరసింహారావు సమాధి, ఎన్టీఆర్ విగ్రహాలను తొలగిస్తామని ఎంఐఎం చేసిన వ్యాఖ్యలపై స్పందించిన బండి సంజయ్... రెండు గంటల్లో ఆ పార్టీకి చెందిన దారుస్సలాంను కూల్చేస్తామని హెచ్చరించారు. పాతబస్తీలో మాట్లాడిన సర్జికల్ స్ట్రైక్స్ వ్యాఖ్యలపై కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.