కృష్ణమ్మ పరవళ్లతో... శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. దీంతో జలాశయం 4 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. స్పిల్ వే ద్వారా 1,11,932 క్యూసెక్కులు విడుదల చేశారు. శ్రీశైలం జలాశయం ఇన్ ఫ్లో 1,81,326 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 884.80 అడుగులు కాగా... ప్రస్తుతం నీటినిల్వ 214.84 టీఎంసీలగా ఉంది. శ్రీశైలం కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా 30,768 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
ఇవీ చూడండి: 'హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నాం'