ETV Bharat / city

భారత్ బంద్​తో.. ఏపీ సచివాలయం నిర్మానుష్యం - ఏపీ సచివాలయం తాజా వార్తలు

భారత్ బంద్ ప్రభావంతో ఏపీ సచివాలయం బోసిపోయింది. బంద్​కు మద్దతు తెలిపిన ఏపీ సర్కార్​.. మధ్యాహ్నం 1 గంట వరకు ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ మూసి వేయాలని, ఆర్టీసీ బస్సు సర్వీసులనూ నిలిపి వేయాలని ఆదేశించింది. దీంతో ఉద్యోగులు, సందర్శకులు రాక సచివాలయ ప్రాంగణం నిర్మానుష్యంగా మారింది.

భారత్ బంద్​తో.. ఏపీ సచివాలయం నిర్మానుష్యం

author img

By

Published : Dec 8, 2020, 3:43 PM IST

దేశవ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్​ సర్కార్​ కూడా బంద్​కు మద్దతు తెలపటం వల్ల ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. గుంటూరు, విజయవాడ నుంచి ఆర్టీసీ బస్సులను నిలిపివేయడంతో ఉద్యోగులు కార్యాలయాలకు రాలేదు. అత్యవసర విభాగాల ఉద్యోగులు మాత్రం ద్విచక్ర వాహనాలపై సచివాలయానికి వచ్చారు.

బంద్ దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సచివాలయ ప్రాంగణంలో పోలీసులు గట్టి పోలీసు బందోబస్తు, నిఘా ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం తర్వాతే సచివాలయానికి ఆర్టీసీ బస్సు సర్వీసులు పునరుద్దరించడం, కార్యాలయాలు తెరచుకోనుండటంతో అప్పట్నుంచి కార్యకలాపాలు ప్రారంభం కానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. రైతులకు మద్దతుగా రాష్ట్రంలోనూ బంద్ కొనసాగుతుండటంతో సచివాలయం నిర్మానుష్యంగా మారింది.

ఇదీ చదవండి: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారత్ బంద్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.