ETV Bharat / city

కొవిడ్ ఎఫెక్ట్ :‌ విద్య, యోగ, కళల సాధనకు ఆన్​లైన్ మంత్రం

కొవిడ్‌ వైరస్‌... మనుషుల్ని ఇంటికే పరిమితం చేయగలిగింది గానీ... మనిషిలో నేర్చుకోవాలనే తపనకు మాత్రం అడ్డుకట్టవేయలేకపోయింది. విద్య, కళా, సాంస్కృతిక రంగాలపై ఆసక్తి ఉన్నవారు.. లాక్‌డౌన్‌ను ఓ వరంలా మలుచుకుంటున్నారు. భగవద్గీత, యోగ, వేమన పద్యాలు, కరాటే తదితర అంశాలను ఏపీ కాకినాడకు చెందిన ఔత్సాహికులు ఆన్‌లైన్‌లోనే నేర్చుకుంటున్నారు.

కొవిడ్ ఎఫెక్ట్ :‌ విద్య, యోగ, కళల సాధనకు ఆన్​లైన్ మంత్రం
కొవిడ్ ఎఫెక్ట్ :‌ విద్య, యోగ, కళల సాధనకు ఆన్​లైన్ మంత్రం
author img

By

Published : Sep 20, 2020, 11:31 AM IST

లాక్‌డౌన్‌లో తరగతి గదులకు దూరంగా ఉన్న విద్యార్థులు.. తమ ఇష్టాలకు, ఆసక్తికర అంశాలకు పెద్దపీట వేశారు. నేరుగా గురువుల వద్ద సాధన చేసే కళలు, సాంస్కృతిక అంశాలను ఆన్‌లైన్‌లోనే నేర్చుకుంటున్నారు. ఏపీ కాకినాడలో వివిధ రంగాలకు చెందిన గురువులు ఆన్‌లైన్‌లో బోధించేందుకు ముందుకురాగా.. విద్యార్థులూ అంతే ఆసక్తిగా క్రమం తప్పకుండా సాధన చేసి యోగ, భగవద్గీత పారాయణం, వేమన పద్యాలు నేర్చుకున్నారు.

తెలుగు రాష్టాల విద్యార్థులకు..

భానుగుడి కూడలికి చెందిన శోభ.. చిన్నప్పుడు నేర్చుకున్న భగవద్గీత, వేమన పద్యాలను.. ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఆన్‌లైన్‌లోనే ఉచితంగా బోధించారు. పదిరోజులకు ఒక బ్యాచ్‌ చొప్పున తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు నేర్పుతున్నారు.

200మందికిపైగా..

జగన్నాథపురం మల్లాడి సత్యలింగం నాయకర్‌ ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలలో పౌరశాస్త్రం బోధిస్తున్న చిట్టిబాబు.. ఆన్‌లైన్‌లో ఉచితంగా యోగ శిక్షణ ఇస్తున్నారు. గతంలో జాతీయ స్థాయిలో పలు ప్రదర్శనలు ఇచ్చిన ఆయన.. కాకినాడ వాసులకు స్కైప్‌, జూమ్‌, గూగూల్‌ మేట్‌ ద్వారా 200 మందికిపైగా యోగసనాలు నేర్పించారు.

ఆన్​లైన్​లో ఉచితంగా..

యోగ, భగవద్గీత కాకుండా.. కరాటే, నృత్యం, ఇతర కళారూపాలనూ పలువురు గురువులు ఆన్‌లైన్‌లో ఉచితంగా బోధిస్తున్నారు.

కొవిడ్ ఎఫెక్ట్ :‌ విద్య, యోగ, కళల సాధనకు ఆన్​లైన్ మంత్రం

ఇవీ చూడండి : భగ్గుమంటున్న ధరలు.. సామాన్యునికి కూర'గాయాలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.