ఏపీ పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఎకగ్రీవాలకు ప్రభుత్వం మొగ్గు చూపుతుంటే.. వీలైనన్నీ నామినేషన్లు వేయిస్తూ వైకాపా వ్యూహాలకు తెదేపా అడ్డుకట్ట వేస్తుంది. ఎన్నికలకు చాలా తక్కువ సమయమే ఉన్నందున.. పలు గ్రామాల్లో వేలం పాటలు జరగుతున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లాల్లోని ఓ గ్రామ పంచాయతీకి జరిగిన వేలం అందరిని షాక్కు గురిచేసింది. సర్పంచ్ సీటు ఏకంగా రూ.50.50 లక్షలు పలికింది.
కలిగిరి మండలం తెల్లపాడు సర్పంచి పదవికి వేలం నిర్వహించారు. ఈ వేలంలో రూ.50.50 లక్షలకు పదవిని ఓ గ్రామస్థుడు దక్కించుకున్నాడు. ఆ నిధులను గ్రామాభివృద్ధికి వినియోగించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇదీ చదవండి: పేద, బలహీన వర్గాల కోసం ప్రభుత్వం ఏమి చేయదా?