ELECTRICAL VENDOR VEHICLE : ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం శశి ఇంజనీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న శ్రీరామ్.. ఎలక్ట్రిక్ వెండర్ వెహికల్ తయారు చేశారు. ఈ వాహనానికి ఆరు నుంచి ఏడు గంటల పాటు ఛార్జింగ్ చేస్తే సుమారు 140 కిలోమీటర్లు ప్రయాణించగలదని చెప్పారు. ఈ వాహనం 400కిలోల బరువును మోయగలదని.. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగవుతుందని శ్రీరామ్ అభిప్రాయపడుతున్నారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
తొలిదశలో వాహన నిర్మాణ వ్యయం ఎక్కువ అయినప్పటికీ రానున్న కాలంలో తక్కువ వ్యయంతో మరో వాహన తయారీ దిశగా అడుగులు వేస్తున్నట్లు శ్రీరామ్ చెప్పారు. ఎలక్ట్రిక్ వెండర్ వెహికల్ చిరు వ్యాపారులకు, ముఖ్యంగా మహిళలకు ఎంతో ఉపయోగకరమన్నారు. తమ ప్రతిభను గుర్తించి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తే మరెన్నో అద్భుతాలు సృష్టిస్తామని శ్రీరామ్ అంటున్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రాలకు లక్ష కోట్ల అదనపు సాయం!