ఎర్రమంజిల్ భవనాల కూల్చివేతపై దాఖలైన పిటిషన్లపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ హెరిటేజ్ చట్టం రాజ్యాంగ విరుద్ధంగా, అసంబద్ధంగా ఉందని హైదరాబాద్ జిందాబాద్ సంస్థ తరఫున సీనియర్ న్యాయవాది నిరూప్ రెడ్డి వాదనలు వినిపించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ హెరిటేజ్ కమిటీ ఏర్పాటు కాలేదని పేర్కొన్నారు. వారసత్వ కట్టడాల జాబితాను ఇప్పటికీ రూపొందించలేదని, చట్టాన్ని అమలు చేసే యంత్రాంగాన్ని కూడా సర్కారు ఏర్పాటు చేయలేదని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.
హెచ్ఎండీఏ ప్రకారమే రక్షణ...
చారిత్రక, వారసత్వ కట్టడాలకు మధ్య తేడాను చట్టంలో సరిగా నిర్వచించలేదన్నారు. హెచ్ఎండీఏ చట్టం ప్రకారం ఎర్రమంజిల్ భవనాలకు రక్షణ కొనసాగుతుందన్నారు. వారసత్వ కట్టడాల జాబితా, మాస్టర్ ప్లాన్ను మార్చాలంటే నిర్దిష్ట విధానం అనుసరించాల్సిందేని వాదించారు. ఇందుకు సంబంధించిన సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టుల తీర్పులను సమర్పించారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 5కు వాయిదా వేసింది.
ఇవీ చూడండి: నాలుగోసారి విజయవంతంగా చంద్రయాన్-2 కక్ష్య పెంపు