వినియోగదారుల ఫోరాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేలా ఆదేశాలు జారీచేయాలని న్యాయవాది చలసాని అజయ్ కుమార్ దాఖలు చేసిన పిల్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ బి. కృష్ణమోహన్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. వినియోగదారుల కమిషన్‌లో ఖాళీల భర్తీకి ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది.
తాజా నోటిఫికేషన్ ప్రకారం ఖాళీ పోస్టుల భర్తీ కోసం ఆధార్టీని ఏర్పాటు చేయాల్సి ఉందని జీపీ బదులిచ్చారు. భర్తీ చేయడానికి కొంత సమయం పడుతుందన్నారు. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. చర్యల్లో పురోగతి వివరాల్ని తెలపాలని ఆదేశాలు జారీచేసిన ధర్మాసనం... తదుపరి విచారణ నెల రోజులకు వాయిదా వేసింది.
ఇదీచదవండి : కరోనా బాధితుల నడ్డివిరుస్తున్న ప్రైవేటు పరీక్షా కేంద్రాలు