ETV Bharat / city

Administration in New districts: కొత్త జిల్లాల్లో ఉగాది నుంచే పాలన.. - ap latest news

Administration in New districts: ఇప్పటికే కొత్త జిల్లాల ఏర్పాటుపై నోటిఫికేషన్‌ జారీ చేసిన ప్రభుత్వం.. ఉగాది నుంతి పరిపాలన ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర సీఎం జగన్​ నిర్ణయం తీసుకున్నారు. తుది నోటిఫికేషన్‌ వచ్చిన రోజు నుంచే కొత్త జిల్లాలపై పాలన నిర్వహించాలని సీఎం సూచించారు.

Administration in New districts
Administration in New districts
author img

By

Published : Feb 10, 2022, 7:50 PM IST

Administration in New districts: ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్లానింగ్‌, రెవెన్యూ, హోంశాఖ అధికారులతో సమీక్షించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కొత్త జిల్లాల్లో అధికారుల విధులకు సంబంధించి కూడా మంత్రులు, అధికారులతో జగన్‌ సమీక్ష నిర్వహించారు.

తుది నోటిఫికేషన్‌ వచ్చిన రోజు నుంచే..

ఉగాది నుంచే కలెక్టర్లు, ఎస్పీలు విధులు నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. ప్రస్తుత కలెక్టర్లు, ఎస్పీలను కొత్త జిల్లాలకు పంపాలని సీఎం అధికారులను ఆదేశించారు. వీరి అనుభవం కొత్త జిల్లాలకు మేలు చేస్తుందనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఓఎస్డీ హోదాలో కొత్త జిల్లాలకు ప్రస్తుత కలెక్టర్లు, ఎస్పీలే ఉంటారని సీఎం తెలిపారు. తుది నోటిఫికేషన్‌ వచ్చిన రోజు నుంచే కొత్త జిల్లాలపై పాలన నిర్వహించాలని సీఎం సూచించారు. ఇక, కొత్త జిల్లాల ఏర్పాటుపై వస్తున్న అభ్యంతరాలు, ప్రజల నుంచి వచ్చిన సలహాలు, సూచనలపైనా చర్చించారు.

పాలన సాఫీగా జరగాలి..

"కొత్త జిల్లాలు ఏర్పడ్డాక యంత్రాంగమంతా సమర్థంగా పనిచేయాలి. ఎలాంటి అయోమయం లేకుండా పాలన సాఫీగా జరగాలి. భవనాలు, మౌలిక వసతులు, ఉద్యోగుల విభజన.. అన్నీ పూర్తి కావాలి. కొత్త భవనాల నిర్మాణానికి ప్రణాళికలు ఖరారు చేయాలి. భవనాల స్థలాల గుర్తింపుపై దృష్టి పెట్టాలి. అభ్యంతరాల విషయంలో హేతుబద్ధత ఉన్నప్పుడు దానిపై నిశిత పరిశీలన చేయాలి. నిర్ణయం తీసుకునేముందు వారితో మాట్లాడటం అన్నది చాలా ముఖ్యం. దీనికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి ఇప్పుడున్న జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలనే కొత్త జిల్లాలకు పంపాలి. వీరికున్న అనుభవం కొత్త జిల్లాలకు ఉపయోగపడుతుంది. వీరు కొత్త జిల్లాల్లో మౌలికసదుపాయాలు, పాలన సాఫీగా సాగేందుకు వీలుగా సన్నాహకాలను పరిశీలిస్తారు. స్థానిక సంస్థల (జిల్లాపరిషత్‌ల విభజన) విషయంలో కూడా అనుసరించాల్సిన విధానాన్ని న్యాయపరంగా, చట్టపరంగా పరిశీలించి తగిన ప్రతిపాదనలు అధికారులు తయారు చేస్తారు." - ఏపీ సీఎం జగన్

అభ్యంతరాలపై పరిశీలన..

ఏపీలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను పునర్‌వ్యవస్థీకరణ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఇప్పటికే కొత్త జిల్లాల ఏర్పాటుపై నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొత్తం 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ గత నెల 25న నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని ఒక జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తూ చర్యలు చేపట్టింది. అయితే.. కొత్త జిల్లాల ఏర్పాటుపై పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కాగా.. నోటిఫికేషన్‌ జారీ చేసిన 30 రోజుల్లోగా జిల్లాల ఏర్పాటుపై వచ్చిన అభ్యంతరాలు, సూచనలు, సలహాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.