Employees Union Meets Sajjala: ప్రభుత్వ సలహాదారుడు సజ్జలతో ఉద్యోగ సంఘాల నేతలు భేటీ అయ్యారు. పీఆర్సీతోపాటు ఇతర డిమాండ్లపై చర్చించారు. సమావేశం అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు. పీఆర్‌సీ, ఇతర డిమాండ్లపై ఏపీ సీఎంతో మాట్లాడి తుది నిర్ణయం తీసుకుంటామని సజ్జల చెప్పారని బండి శ్రీనివాస్ వెల్లడించారు. పీఆర్‌సీపై సీఎం సోమవారం నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. మిగతా 70 డిమాండ్లపైనా చర్చించి బుధవారం నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
సీఎంవో అధికారికి ఇస్తామన్నారు..
ఉద్యమాన్ని తాము పూర్తి విరమించలేదని బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. తమ సమస్యల పరిష్కారంపై లిఖితపూర్వక హామీ ఇచ్చారని చెప్పారు. ప్రభుత్వానికి అవకాశం ఇచ్చేందుకే ఉద్యమం తాత్కాలిక వాయిదా వేశామని వెల్లడించారు. సమస్యల పరిష్కార బాధ్యత సీఎంవో అధికారికి ఇస్తామన్నారు.
సీఎం జగన్ సమీక్ష..
CM Jagan Review On PRC: ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ, ఇతర డిమాండ్లపై ముఖ్యమంత్రి జగన్ వరుసగా రెండో రోజూ సమీక్షించారు. సమీక్షలో పాల్గొన్న మంత్రి బుగ్గన, ప్రభుత్వ సలహాదారు సజ్జల.. నిన్న ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చల వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు. ఉద్యోగులకు ఫిట్‌మెంట్ ఎంత శాతం ఇవ్వాలనే అంశంతోపాటు సీపీఎస్ రద్దు, ఒప్పంద సిబ్బంది క్రమబద్ధీకరణ అంశాలపై ముఖ్యమంత్రి రెండు గంటలపాటు చర్చించారు.
ఫిట్‌మెంట్, డిమాండ్ల అమలు వల్ల ఖజానాపై ఎంతమేర భారం పడుతుందనే అంశంపై సమీక్షలో చర్చించారు. సోమవారం ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం జగన్ చర్చించి ఫిట్‌మెంట్ ఖరారు చేసే అవకాశాలున్నాయి. ఉద్యోగుల ఇతర డిమాండ్లైన సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసుల క్రమబద్దీకరణ సహా ఇతర డిమాండ్ల పరిష్కారంపైనా సోమవారం సీఎం స్పష్టమైన హామీ ఇచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి: