ETV Bharat / city

AP Employees Strike: ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం: ఏపీ సీఎస్ - ap cs on prc GOs

AP Employees Strike: ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ వెల్లడించారు. ఉద్యోగులకెవరికీ జీతాలు తగ్గించవద్దని సీఎం జగన్‌ చెప్పారన్నారు.

AP Employees
AP Employees
author img

By

Published : Feb 1, 2022, 8:25 PM IST

AP Employees Strike: ఉద్యోగులు, ప్రభుత్వం వేర్వేరు కాదని.. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ వెల్లడించారు. ఉద్యోగులకెవరికీ జీతాలు తగ్గించవద్దని సీఎం జగన్‌ చెప్పారన్నారు. ఈ మేరకు మంగళవారం రాత్రి వరకు ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తామని చెప్పారు. ఇవాళ జీతాలు రాని వారికి బుధవారం జమ చేస్తామని పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రుల బృందం చర్చిస్తోందన్న ఆయన... ఉద్యమ కార్యాచరణను ఉద్యోగులు వాయిదా వేసుకోవాలని కోరారు. సమస్యలకు సమ్మె పరిష్కారం కాదని వ్యాఖ్యానించారు. ఉద్యోగులతో ఓపెన్‌ మైండ్‌తో చర్చలకు సిద్ధంగా ఉన్నామన్నారు.

"రాత్రి 11లోగా కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాలు. అభ్యంతరాలను చర్చలతో పరిష్కరించుకునే అవకాశం ఉంది. చలో విజయవాడ, సమ్మె కార్యాచరణ విరమించుకోవాలి. సమ్మెకు వెళ్లడం అంటే కష్టాలు కొని తెచ్చుకోవడమే. ప్రభుత్వం చర్చలకు సిద్ధమని మరోసారి తెలియచేస్తున్నా. ఉద్యోగులు సమ్మెను అసాంఘిక శక్తులు కైవసం చేసుకునే అవకాశం ఉంది. పీఆర్సీ విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి దురుద్దేశాలు లేవు"

- సీఎస్ సమీర్‌శర్మ

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి:

Cm Kcr on Budget: బడ్జెట్‌ అంతా గోల్‌మాల్‌ గోవిందం: సీఎం కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.