ETV Bharat / city

ఏపీలో కొత్తగా 23,920 కరోనా కేసులు.. 83 మరణాలు - ఏపీ కరోనా తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్​లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఆ రాష్ట్రంలో కొత్తగా 23,920 కరోనా కేసులు, 83 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆంధ్రాలో 1,43,178 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి.

corona cases
ఏపీలో కొత్తగా 23,920 కరోనా కేసులు, 83 మరణాలు
author img

By

Published : May 2, 2021, 8:32 PM IST

ఏపీలో కొత్తగా 23,920 కరోనా కేసులు, 83 మరణాలు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో లక్షా 14,299 పరీక్షలు నిర్వహించారు. కరోనా నుంచి మరో 11, 411 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 1,43,178 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి.

తూర్పు గోదావరి జిల్లాలో 12 మంది..

కరోనాతో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 12 మంది మృతి చెందగా.. విశాఖ, అనంతపురం, కృష్ణాలో 8 మంది మృత్యువాత పడ్డారు. మహమ్మారితో విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో ఏడుగురు చొప్పున మృతి చెందారు. చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆరుగురు చొప్పున మరణించారు. వైరస్ బారిన పడి గుంటూరు జిల్లాలో 5, కర్నూలు జిల్లాలో నలుగురు కన్నుమూశారు.

జిల్లాల వారీగా..

మరోవైపు చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 2,945 కరోనా కేసులు నమోదు కాగా... తూర్పుగోదావరి 2,831, శ్రీకాకుళంలో 2,724 కేసులను గుర్తించినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కర్నూలు 2,516, గుంటూరు 2,384 కేసులు, పశ్చిమ గోదావరి 1,977, విశాఖలో 1,938 కొవిడ్ కేసులు నిర్ధరణ అయినట్లు తెలిపింది. ప్రకాశం 1,378, అనంతపురం జిల్లాలో 1,303 కరోనా కేసులు నమోదైనట్లు స్పష్టం చేసింది. కడప 1,055, నెల్లూరు 1,011, కృష్ణా 989, విజయనగరం జిల్లాలో 849 వైరస్ కేసులను గుర్తించినట్లు వివరించింది.

ఇదీ చదవండి: 'దేశవ్యాప్తంగా ఉచిత టీకా డ్రైవ్​ చేపట్టండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.