ఏపీ సచివాలయంలో కరోనా కారణంగా మరో ఇద్దరు ఉద్యోగులు మృతిచెందారు. పంచాయతీరాజ్ శాఖ సెక్షన్ ఆఫీసర్గా పని చేస్తున్న శాంతి కుమారి, హోంశాఖ రికార్డు అసిస్టెంట్ ఏఎస్ఎన్ మూర్తి.. కరోనాతో మృత్యువాత పడ్డారు.
తాజా మరణాలతో సచివాలయ ఉద్యోగులు భయాందోళనలో గురవుతున్నారు. కరోనా తీవ్రత దృష్ట్యా ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు ఇవ్వాలని.. ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: వైకాపా నాయకులు లైంగికంగా వేధించారని... ఆశా కార్యకర్త ఆత్మహత్యాయత్నం