పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్, కాలువల సామర్థ్యం పెంచుతూ చేపట్టనున్న పథకాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం తన వాదనను త్వరలో కృష్ణా బోర్డు ముందుంచనుందని విశ్వసనీయ సమాచారం. ఈ విషయంపై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు లేఖ రాసింది. వారు ఆంధ్రప్రదేశ్ వివరణ కోరిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ఉన్నతాధికారులు కృష్ణా బోర్డుకు సమాధానమిచ్చేందుకు వీలుగా లేఖలు సిద్ధం చేశారు. ఆ లేఖలు పంపాలా? లేదా అధికారుల బృందం వెళ్లి కృష్ణా బోర్డు పెద్దలను కలిసి వాదనలు వినిపించాలా? అనే విషయంలో చర్చిస్తున్నారని సమాచారం. ముఖ్యమంత్రి కార్యాలయ స్థాయిలోనూ ఈ అంశంపై తర్జనభర్జనలు కొనసాగాయి. సోమవారం తుది నిర్ణయం తీసుకుంటామని జలవనరుల శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
ఇదీ చదవండి :