AP corona cases : ఏపీలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 40,635 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 12,561 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు 22,45,713 మంది కరోనా బారిన పడ్డారు. కరోనా నుంచి 8,742 మంది పూర్తిగా కోలుకున్నారు. ఇప్పటివరకు మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 21,17,822కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,13,300 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. కొత్తగా మరో 12 మంది కొవిడ్ బారినపడి మరణించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 14,591 మంది మహమ్మారికి బలయ్యారు.
కర్నూలు జిల్లాలో అత్యధికంగా 1710 కరోనా కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 1625, కడప జిల్లాలో 1215 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. విశాఖ, తూర్పుగోదావరి, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో వెయ్యికిపైగా కరోనా కేసులు నమోదయ్యాయి.
-
#COVIDUpdates: 28/01/2022, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) January 28, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 22,45,713 పాజిటివ్ కేసు లకు గాను
*21,17,822 మంది డిశ్చార్జ్ కాగా
*14,591 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,13,300#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/TpdJX1qJNz
">#COVIDUpdates: 28/01/2022, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) January 28, 2022
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 22,45,713 పాజిటివ్ కేసు లకు గాను
*21,17,822 మంది డిశ్చార్జ్ కాగా
*14,591 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,13,300#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/TpdJX1qJNz#COVIDUpdates: 28/01/2022, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) January 28, 2022
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 22,45,713 పాజిటివ్ కేసు లకు గాను
*21,17,822 మంది డిశ్చార్జ్ కాగా
*14,591 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,13,300#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/TpdJX1qJNz
దేశంలో..
Corona cases in India: భారత్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. 24 గంటల వ్యవధిలో.. 2,51,209 కేసులు నమోదయ్యాయి. అయితే క్రితం రోజుతో పోలిస్తే ఈ సంఖ్య కాస్త తక్కువే. వైరస్‌తో మరో 627 మంది మరణించారు. 3,47,443 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 15.88 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
- మొత్తం కేసులు: 4,06,22,709
- మొత్తం మరణాలు: 4,92,327
- యాక్టివ్ కేసులు: 21,05,611
- మొత్తం కోలుకున్నవారు:3,80,24,771
Vaccination in India
భారత్‌లో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. గురువారం ఒక్కరోజే 57,35,692 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,64,44,73,216కు చేరింది.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: సామాజిక ఉద్యమంగా మలచినప్పుడే డ్రగ్స్ కట్టడి సాధ్యం: సీఎం