GO release on Pensions: ఆంధ్రప్రదేశ్లో వద్ధ్యాప్య, వితంతు, ఒంటరి మహిళలు, కల్లుగీత తదితర విభాగాలకు చెందిన సామాజిక పింఛన్లు పెరిగాయి. రూ.2,250 నుంచి రూ.2,500కు పెంచుతూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2021 డిసెంబరు నుంచి ఈ పెంపుదల వర్తిస్తుందని తెలిపింది.
2022 జనవరి 1 తేదీన పెరిగిన మొత్తంతో పింఛన్ చెల్లించనున్నట్టు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్ఫష్టం చేసింది. ఈ మేరకు పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు ఇచ్చారు. ఈ పెంపుదలతో ప్రభుత్వంపై అదనంగా రూ.129 కోట్ల మేర భారం పడుతుందని పేర్కొంది.
ఇదీ చూడండి: Allu Aravind, Sukumar met governor : పుష్ప చిత్రాన్ని వీక్షించాలని గవర్నర్ తమిళిసైకి ఆహ్వానం