ETV Bharat / city

గవర్నర్‌ నిర్ణయంపై తీవ్రస్థాయిలో నిరసనలు - భగ్గుమన్న అమరావతి

రాజధాని బిల్లులపై గవర్నర్‌ సంతకం చేయడంతో ఒక్కసారిగా అమరావతి భగ్గుమంది. రైతులు పరుగున దీక్షా శిబిరాలకు బయల్దేరారు. తుళ్లూరులోని ధర్నాచౌక్‌ వద్దకు చేరుకొని ధర్నా చేశారు. గుంటూరు-తుళ్లూరు, విజయవాడ-అమరావతి రోడ్లపై బైఠాయించి నినాదాలు చేశారు.

amaravati
గవర్నర్‌ నిర్ణయంపై తీవ్రస్థాయిలో నిరసనలు
author img

By

Published : Aug 1, 2020, 7:31 AM IST

ఆంధ్రప్రదేశ్​ రాజదాని అమరావతిని విచ్ఛిన్నం చేసేందుకు దిల్లీ పెద్దల నాటకంలో భాగంగానే బిల్లులపై గవర్నర్‌ సంతకం చేశారని రాజధాని పరిరక్షణ జేఏసీ కన్వీనరు పువ్వాడ సుధాకర్‌ అన్నారు. శనివారం నుంచి అన్ని శిబిరాల్లో పెద్దఎత్తున నిరసన దీక్షలు చేసి ప్రభుత్వం కళ్లు తెరిపించాలన్నారు. ఇకనుంచి 29 గ్రామాల్లోనే కాకుండా రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఉద్యమిస్తామన్నారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి గ్రామాల్లో శుక్రవారం రైతులు, మహిళలు పెద్దఎత్తున దీక్షలు చేశారు.

కొవ్వొత్తులను చేతబూని రాజధాని అమరావతి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. వెలగపూడి, నెక్కల్లులో కొందరు రైతులు రోడ్లపై టైర్లు తగలబెట్టారు. మహిళలు కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బిల్లుల ఆమోదం పొందాయన్న నిర్ణయంతో వెలగపూడిలో జొన్నలగడ్డ సురేశ్‌ అనే రైతు చెప్పుతో కొట్టుకున్నారు. తమకు మరణం కన్నా మరో దారి లేదంటూ వెలగపూడిలో కొందరు రైతులు నీళ్లట్యాంకు ఎక్కేందుకు యత్నించారు. పోలీసులు అమరావతి గ్రామాల్లో భారీగా మోహరించారు.

నేడు రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపు
పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను గవర్నర్‌ ఆమోదించడాన్ని నిరసిస్తూ శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని అమరావతి రైతుల ఐకాస పిలుపునిచ్చింది. శనివారం నుంచి దీక్షలు కొనసాగుతాయని అమరావతి పరిరక్షణ సమితి ఐకాస కన్వీనరు శివారెడ్డి తెలిపారు.

న్యాయ పోరాటానికి సిద్ధం
రాష్ట్ర చరిత్రలో ఇది దుర్దినమని, అమరావతే రాజధాని కావాలంటూ కుల, మత, ప్రాంతాలకతీతంగా ఉద్యమం చేస్తుంటే బిల్లులపై గవర్నర్‌ సంతకాలు చేయడం ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనని అమరావతి పరిరక్షణ సమితి (జేఏసీ) కన్వీనర్‌ ఎ.శివారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలోని రాజధాని పరిరక్షణ సమితి కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఎస్‌ఈసీ విషయంలో లాగే రాజధాని అంశంలోనూ ప్రభుత్వం అభాసు పాలవుతుందన్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని, జనసేనాని పవన్‌కల్యాణ్‌ కలసి రావాలన్నారు.

ఏపీ చరిత్రలో చీకటి రోజు.. అమరావతి ఐకాసతో కలిసి న్యాయ, ప్రజాపోరాటం చేస్తాం: చంద్రబాబు

పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లులపై గవర్నర్‌ సంతకం చేసిన ఈరోజు (శుక్రవారం).. ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో చీకటి రోజని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. గవర్నర్‌ సంతకం చేసినంత మాత్రాన అది రాజ్యాంగ, చట్ట వ్యతిరేకం కాకుండా పోతుందా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ వ్యవహారంలో చివరికి రాజ్యాంగం, చట్టం గెలిచి న్యాయం జరిగిన విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. గవర్నర్‌ నిర్ణయం చారిత్రక తప్పిదం, రాజ్యాంగ విరుద్ధం, విభజన చట్టానికి వ్యతిరేకమని పేర్కొన్నారు. రేప్పొద్దున హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు నగరాల నుంచి రాజధానులను మార్చేస్తామని అక్కడి ప్రభుత్వాలు అంటే దానికీ కేంద్రం అనుమతిస్తుందా? అని ప్రశ్నించారు. అమరావతిలో రాజధానిని అభివృద్ధి చేస్తామని భూములిచ్చిన రైతులకు చట్టపరంగా హామీ ఇచ్చామని.. ఇప్పుడు ప్రభుత్వం దాన్ని ఉల్లంఘించి విశ్వాసఘాతుకానికి పాల్పడిందని ధ్వజమెత్తారు. అమరావతి పరిరక్షణ సమితి ఐకాసతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా న్యాయ, ప్రజాపోరాటం చేస్తామని పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన విలేకర్లతో తీవ్ర భావోద్వేగానికి లోనై మాట్లాడారు. బిల్లుల ఆమోదం రాజ్యాంగ ఉల్లంఘన, చట్ట వ్యతిరేకం, విభజనచట్టానికి విరుద్ధం, భవిష్యత్తుకు గొడ్డలిపెట్టు అని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వర్చువల్‌ ఆందోళనలు, నిరసనలు నిర్వహిస్తామని చెప్పారు.

ఎన్నికలు.. లేదా రెఫరెండం

మూడు రాజధానులపై ప్రభుత్వానికి నమ్మకముంటే అసెంబ్లీని రద్దుచేసి అదే అంశంపై ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అందుకు భయపడితే రెఫరెండం పెట్టి ప్రజల అభిప్రాయం తీసుకోవాలన్నారు. వారంతా రాజధానిగా అమరావతిని వద్దని చెబితే తానిక మాట్లాడనని పేర్కొన్నారు.

కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి..

అమరావతి లాంటి ప్రాజెక్టును చంపేస్తుంటే ఒక్కోసారి నా కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. నా ఆరోగ్యం బాగుంటే మరో పదేళ్లు ఎక్కువ ఉంటాను. నా బాధంతా అమరావతి కోసం. నేను అనుభవించటానికి రాజధాని కట్టలేదు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా 40 ఏళ్లు రాజకీయం చేశాను. నాకు ఇంకేం కావాలి? ఈరోజు చీకటి రోజని నేను చెప్పిన మాటను భవిష్యత్తులో అందరూ అంగీకరిస్తారు. ఈ మీడియా సమావేశం చరిత్రలో నిలిచిపోతుంది. రాసిపెట్టుకోండి.

ప్రజలే ఆలోచించాలి..

ప్రభుత్వ దుర్మార్గ నిర్ణయం వల్ల రాష్ట్రం ఎలా నష్టపోతుందో ప్రజలు ఆలోచించాలి. దానికి వ్యతిరేకంగా ముందుకొచ్చి నిలబడాలి. ప్రజలే వారి భవిష్యత్తును కాపాడుకోవాలి. ఎక్కడికక్కడ నిరసన, అసమ్మతి తెలియజేయాలి. ఇది ప్రజల, రాష్ట్ర, భావితరాల భవిష్యత్తుకు సంబంధించిన అంశమనేది గుర్తుంచుకోవాలి. అయిదు కోట్ల మంది ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. రేపటి నుంచి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. కలిసి వచ్చేవారందరితో కలిపి పోరాటం చేస్తాం.

ఇదీ చదవండి: గవర్నర్ నిర్ణయం చారిత్రక తప్పిదం: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.