ETV Bharat / city

JNTU: అడ్డదారిలో ఎంపికలు.. నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు - allegations on jntu officers

అర్హతలుండవు... ధ్రువపత్రాలు సరిగా ఉండవు.. అయినప్పటికీ కాసులు కుమ్మరిస్తే చాలు.. సులువుగా పోస్టు దక్కించుకోవచ్చు. జేఎన్‌టీయూ అధికారుల వ్యవహారశైలితో అర్హత లేని ఆచార్యులకు వర్సిటీ గుర్తింపు కళాశాలల్లో అందలం దక్కుతోంది. కొన్ని నెలలుగా జేఎన్‌టీయూలో పర్యవేక్షణ కొరవడి అధికారులు తమకు నచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Criticisms of JNTU, JNTUH, JNTU trend
జేఎన్టీయూ, జేఎన్టీయూహెచ్, జేఎన్టీయూ తీరుపై విమర్శలు
author img

By

Published : Jul 3, 2021, 10:03 AM IST

  • హైదరాబాద్ నగర శివారులోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాల. కొన్ని నెలల కిందట కళాశాలలో పనిచేసే ఆచార్యుడ్ని ప్రిన్సిపల్‌గా నియమించేందుకు ఆమోదం కోసం యాజమాన్యానికి దరఖాస్తు చేసింది. సదరు ఆచార్యుడికి ప్రిన్సిపల్‌గా అర్హతలు లేవు. జేఎన్‌టీయూ గుర్తించని వర్సిటీ నుంచి పీహెచ్‌డీ చేసినట్లు చూపించారు. దీనికితోడు సదరు ఆచార్యుడు గతంలో పనిచేసిన కళాశాలలో బీటెక్‌, ఎంటెక్‌, పీహెచ్‌డీ ఒడిశాలోని యూనివర్సిటీ నుంచి చేసినట్లుగా చూపించారు. వాస్తవానికి సదరు యూనివర్సిటీలో అసలు బీటెక్‌ మినహా ఇతర కోర్సులేవీ లేవు. గతంలో పనిచేసిన కళాశాలకు సమర్పించిన సర్టిఫికెట్లకు, ప్రస్తుతం పనిచేస్తున్న కళాశాలలో ఇచ్చిన సర్టిఫికెట్లకు పొంతన లేదు. అయినా యాజమాన్యం అండదండలతో నకిలీ అర్హత పత్రాలు చూపించి ప్రిన్సిపల్‌ అయ్యేందుకు వర్సిటీకి దరఖాస్తు చేశారు. దీనిపై స్టాఫ్‌ సెలక్షన్‌ కమిటీ మినిట్స్‌(ఎస్‌సీఎం)లో ఆచార్యుడి అర్హతలు పరిశీలించి నియామకం చెల్లదని స్పష్టం చేయాలి. వర్సిటీ అధికారులు సదరు ఆచార్యుడి నియామకాన్ని ర్యాటిఫై చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
  • ఖమ్మం సమీపంలోని మరో ఇంజినీరింగ్‌ కళాశాల. ప్రిన్సిపల్‌ పీహెచ్‌డీని అమెరికాలో చేసినట్లు చూపించారు. వాస్తవానికి ఇది ఆన్‌లైన్‌ విశ్వవిద్యాలయం కాగా మన వద్ద ఎలాంటి గుర్తింపు లేదు. అతనిపై వచ్చిన ఫిర్యాదు మేరకు జేఎన్‌టీయూ అధికారులు విచారణ చేసి ప్రిన్సిపల్‌గా అర్హత లేదని తేల్చారు. ఆన్‌లైన్‌ డిగ్రీలు చెల్లవని యూజీసీ స్పష్టం చేసినా, జేఎన్‌టీయూకు చెందిన మరో అధికారి అతన్ని ర్యాటిఫై చేశారు.

కాసులు కుమ్మరిస్తే చాలు.. అర్హత, ధ్రువపత్రాలు లేకున్నా సులువుగా కావాల్సిన పోస్టు దక్కించుకోవచ్చు. జేఎన్టీయూ అధికారుల వ్యవహారశైలితో అర్హత లేని ఆచార్యులకు అందలం దక్కుతోంది. పర్యవేక్షణ కొరవడి జేఎన్టీయూ అధికారులు తమకు నచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రక్రియ ఇలా జరగాలి..

కళాశాలకు ప్రిన్సిపల్‌గా ఎంపికవ్వాలంటే కనీసం 13 ఏళ్ల రెగ్యులర్‌ బోధన అనుభవం, అధీకృత విశ్వవిద్యాలయ నుంచి పీహెచ్‌డీ చేసి ఉండాలి. ప్రిన్సిపల్‌ నియామకం కోసం కళాశాల యాజమాన్యం తరఫున రూ.11 వేల డీడీ చెల్లించి వర్సిటీకి దరఖాస్తు చేసుకోవాలి. ప్రతిపాదిత ఆచార్యుడి అర్హతలపై స్టాఫ్‌ సెలక్షన్‌ కమిటీ మినిట్స్‌లో చర్చించాలి. అన్ని అర్హతలు, ధ్రువపత్రాలు క్షుణ్నంగా తనిఖీ చేయాలి. ఆ తర్వాతే ర్యాటిఫై చేస్తూ వర్సిటీ ఆదేశాలు జారీ చేయాలి. జేఎన్‌టీయూ అధికారులు మాత్రం అర్హతలు లేని వ్యక్తులను ప్రిన్సిపల్స్‌గా నియమించేందుకు ఆమోదం తెలుపుతున్నారు.

ఉల్లంఘన ఇలా..

నిబంధనలు తుంగలో తొక్కి అధికారులు ప్రిన్సిపల్స్‌ నియామకానికి ఆమోదం తెలుపుతున్నారు. 13 ఏళ్ల బోధన అనుభవం లేని వ్యక్తులకు పదవులు కేటాయించారు. వాస్తవానికి కళాశాల యాజమాన్యం తమకు అనుకూలంగా ఉండే వారిని ప్రిన్సిపల్స్‌గా ఎంపిక చేస్తుంది. కానీ అన్ని అర్హతలు పరిశీలించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. వర్సిటీ అధికారులు సైతం యాజమాన్యాలకు వంత పాడుతున్నారు. రెగ్యులర్‌ సర్వీసు లేకపోయినా, కేవలం పదేళ్ల అనుభవం ఉన్న వారికీ పదవులు కట్టబెట్టారన్న ఆరోపణలున్నాయి. ‘జేఎన్‌టీయూలో కొన్నిరోజులుగా అర్హత లేని వ్యక్తులకు సైతం నిబంధనలకు విరుద్ధంగా ప్రిన్సిపల్‌ పదవులు ఇచ్చారు. దీనిపై వర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేసినా, పట్టించుకోలేదు. దీనిపై వీసీ దృష్టి సారించి చర్యలు తీసుకోవాలి.’ అని తెలంగాణ రాష్ట్ర సాంకేతిక, ప్రొఫెషనల్‌ కళాశాలల ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు బాలకృష్ణారెడ్డి డిమాండ్‌ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.