హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి నిర్వహించారు. స్వరాష్ట్ర సాధనే ఊపిరిగా తొలి, మలి దశ ఉద్యమాలను ముందుండి నడిపించిన బాపూజీ ఆశయ సాధనకు కృషి చేయాలని పలువురు నాయకులు కోరారు.
అశోక్‌నగర్‌లోని ఎమ్మెల్యే ముఠా గోపాల్ గత నివాసం వద్ద కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి ముఠా గోపాల్, హోం శాఖ మాజీ మంత్రి నాయిని నర్సింహ రెడ్డి, రాష్ట్ర తెదేపా అధ్యక్షుడు రమణ, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం. అనిల్ కుమార్ యాదవ్, భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, ప్రదేశ్ గంగపుత్ర సంఘం అధ్యక్షుడు ఏఎల్ మల్లయ్య, కార్పొరేటర్లు ముఠా పద్మ నరేశ్, వి. శ్రీనివాస్ రెడ్డి, తెరాస నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఎందరికో స్ఫూర్తి ప్రదాత మన తెలంగాణ ముద్దుబిడ్డ దివంగత కొండా లక్ష్మణ్ బాపూజీ చూపిన మార్గంలో ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస, భాజపా, తెదేపా, కాంగ్రెస్, తెజస నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 75 ఏళ్లు బ్రహ్మచారిగా ఉద్యమం చేశారు: మంత్రి ఎర్రబెల్లి