ETV Bharat / city

ఏఐజీ ఆసుపత్రిలో గ్యాస్ట్రో ఎంట్రాలజీలో ఏఐ ప్రవేశం - కృత్రిమ మేథ లేటెస్ట్​ వార్తలు

కెనడాలోని సాటిస్ఫై ఆసుపత్రి సహాయంతో హైదరాబాద్​లోని ఏఐజీ ఆసుపత్రిలో గ్యాస్ట్రో ఎంట్రాలజీ, ఎండోస్కోపీలో కృత్రిమ మేథను ప్రవేశపెడుతున్నట్లు ఆసుపత్రి ఛైర్మన్​ డాక్టర్ డి. నాగేశ్వర్​రెడ్డి తెలిపారు. దీని ఫలితంగా రోగుల్లో వ్యాధిని త్వరగా గుర్తించడంతో పాటు ఆర్థిక భారాన్ని తగ్గించవచ్చని తెలిపారు.

AI introduced in Gastro Entomology at AIG Hospital, Hyderabad
ఏఐజీ ఆసుపత్రిలో గ్యాస్ట్రో ఎంట్రాలజీలో ఏఐ ప్రవేశం
author img

By

Published : Oct 7, 2020, 2:04 PM IST

గ్యాస్ట్రో ఎంట్రాలజీలో క్యాన్సర్​కు దారితీసే దీర్ఘకాలిక అనారోగ్యాలను ముందే పసిగట్టి నివారించేందుకు హైదరాబాద్​లోని ఏఐజీ ఆసుపత్రి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. గ్యాస్ట్రో ఎంట్రాలజీ, ఎండోస్కోపీలో కృత్రిమ మేథను ప్రవేశపెడుతున్నట్లు ఆ ఆసుపత్రి ఛైర్మన్​ డాక్టర్ డి.నాగేశ్వర్​రెడ్డి తెలిపారు. ఈ మేరకు కెనడాలోని సాటిస్ఫై ఆసుపత్రితో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెబినార్​ ద్వారా ఆయన వివరించారు.

ఏఐజీ ఆసుపత్రిలో ఇప్పటికే ప్యాథాలజీ, రేడియాలజీలో ఏఐను అమలు చేస్తుండగా గ్యాస్ట్రో ఎంట్రాలజీలో తొలిసారి అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కెనడా-భారత్​ కలయికలో గ్యాస్ట్రో ఎంట్రాలజీలో అతిపెద్ద మార్పునకు ఏఐజీ ఆసుపత్రి శ్రీకారం చుట్టినట్లు నాగేశ్వర్​రెడ్డి వెల్లడించారు. ఫలితంగా రోగుల్లో వ్యాధిని త్వరగా గుర్తించడంతో పాటు ఆర్థిక భారాన్ని తగ్గించవచ్చని తెలిపారు.

ఇదీ చదవండిః 'జులై 13 నుంచి కృత్రిమ మేథలో సర్టిఫికెట్​ కోర్సు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.