ETV Bharat / city

ఛలో ట్యాంక్​ బండ్​ నేపథ్యంలో ముందస్తు అరెస్ట్​లు - tsrtc strike updates

ఆర్టీసీ కార్మికుల చలో ట్యాంక్​బండ్​ దృష్ట్యా పోలీసులు నగరంలోని నాయకులను ముందస్తు అరెస్ట్ చేశారు. బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్​. కృష్ణయ్యను ఉదయం అదుపులోకి తీసుకోగా... భాజపా నగర ఉపాధ్యక్షుడు కన్నే రమేష్​ యాదవ్​ను గత రాత్రే అదుపులోకి తీసుకుని పోలీస్​ స్టేషన్​కు తరలించారు.

చలో ట్యాంక్​ బండ్​ నేపథ్యంలో ముందస్తు అరెస్ట్​లు
author img

By

Published : Nov 9, 2019, 11:32 AM IST

ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన చలో ట్యాంక్ బండ్​కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. అరెస్టుల్లో భాగంగా పలువురు నాయకులను పోలీస్​ స్టేషన్లకు తరలిస్తున్నారు. ఇవాళ ఉదయం బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యను ఉస్మానియా యూనివర్సిటీలో ఉదయం నడక చేస్తుండగా అదుపులోకి తీసుకొని నల్లకుంట పోలీస్ స్టేషన్ తరలించారు. భాజపా నగర ఉపాధ్యక్షులు కన్నె రమేష్ యాదవ్​ను రాత్రి 11 గంటల సమయంలో ఆయన నివాసంలో అదుపులోకి తీసుకుని కాచిగూడ పోలీస్ స్టేషన్​కు తరలించారు.

ఛలో ట్యాంక్​ బండ్​ నేపథ్యంలో ముందస్తు అరెస్ట్​లు

ఇదీ చూడండి : పెయింట్​ డబ్బాలు పడేస్తున్నారా... తస్మాత్​ జాగ్రత్త!

Intro:తాజా: ఆర్టిసి తలపెట్టిన మిలియన్ మార్చ్ సందర్భంగా ముందస్తు అరెస్టులో భాగంగా ఇవాళ ఉదయం బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యను ఉస్మానియా యూనివర్సిటీలో వాకింగ్ చేస్తుండగా అదుపులోకి తీసుకుని నల్లకుంట పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది... దాంతోపాటు బిజెపి నగర ఉపాధ్యక్షులు కన్నె రమేష్ యాదవ్ రాత్రి 11 గంటల సమయంలో ఆయన నివాసంలో అదుపులోకి తీసుకొని కాచిగూడ పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది...
ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూఆర్టీసీ సమ్మె విషయంలో ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా సానుకూల నిర్ణయం తీసుకోవాలి ఆశిస్తున్నాము పరిస్థితి ఇలాగే కొనసాగితే రోజురోజుకు సమ్మె ఉధృతం అవుతుంది శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుంది... ఈరోజు నేను ఉస్మానియా యూనివర్సిటీలో మార్నింగ్ వాకింగ్ చేస్తూ ఉండగా ప్రివెంటివ్ అరెస్ట్ పేరుతో నిర్బంధించడం సరికాదు... ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల పట్ల అవలంబిస్తున్న వైఖరి సరైనది కాదు.. ఆర్టీసీ కార్మికుల చాలా చిన్న డిమాండ్లు... పక్క రాష్ట్రమైన ఏపీలో విలీనం జరిగింది ఇంకా దేశంలో చాలా రాష్ట్రాల్లో గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి మన రాష్ట్రంలో కార్పొరేట్ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం సరైన పద్ధతి కాదు ప్రైవేట్ పరం చేస్తే అణగారిన వర్గాలకు చెందిన కార్మికులకు చాలా అన్యాయం జరుగుతుంది... కావున మన ముఖ్యమంత్రి గారు ప్రతిష్టకు పోకుండా ఆర్టీసీ సమస్యకు చక్కని పరిష్కారం చూపించాలి.. ఇవాళ మిలియన్ మార్చ్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో కార్మికులను నాయకులను అరెస్టు పేరులతో అరెస్టు చేయడం ప్రజలను నాయకులను రెచ్చగొట్టడమే అవుతుంది పోలీసుల ద్వారా నిర్బంధించి ఉద్యమాలను అణచి వేయడం అనే వైఖరిని మార్చుకోవాల్సి ఉంటుంది.. ఇప్పటికైనా కార్మికులను చర్చలకు పిలిచి న్యాయమైన డిమాండ్లను నలుగురు పెద్దమనుషుల ని పిలిపించి మాట్లాడితే పరిష్కారం లభిస్తుంది తప్ప అణిచివేయాలని చూస్తే సమస్యకు పరిష్కారం లభించక పోగా సమ్మె ఉధృతం అవుతుంది శాంతిభద్రతలు అదుపు తప్పుతాయి ఇప్పటికైనా చర్చలకు ఆహ్వానిస్తారని ఆశిస్తున్నానుBody:విజేందర్ అంబేరుపేటConclusion:8555855674
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.