ఏపీ ప్రకాశం జిల్లాలోని కనిగిరి అంటేనే.. మెట్ట ప్రాంతం. మనుషులకే తాగడానికి నీరు దొరకని పరిస్థితి. పైగా... వేసవి కాలం వచ్చిందంటే భరించలేని ఉక్కపోతతో సతమతమవుతుంటారు. ఇలాంటి ఈ పరిస్థితుల్లో కొండ ప్రాంతంలో నివసించే వానరాలు, పక్షుల దాహార్తి వర్ణించలేనిది. కనీసం తినడానికి తిండి, గొంతు తడుపుకోవడానికి నీరు లేక.. అలమటిస్తూ.. ఆర్తనాదాలు చేస్తున్న పరిస్థితిని గమనించాడు శ్రీరామ్ అనే యువకుడు. నాలుగేళ్లుగా అన్నీ తానై అండగా నిలుస్తున్నారు.
కనిగిరికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండ ప్రాంతానికి.. తన స్నేహితులతో కలిసి పండ్లు, క్యాన్లతో నీళ్లు తీసుకుని వాటి ఆకలిదప్పులు తీర్చుతున్నాడు. కొందరు ఆకతాయిలు అకారణంగా అడవులకు నిప్పు పెట్టటం వల్ల ఎన్నో మూగజీవాలు అంతరించిపోతున్నాయని శ్రీరామ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, యువకులు ముందుకు వచ్చి.. అంతరించిపోతున్న పక్షుజాతులను కాపాడుకుందామని ఆ యువకుడు ప్రాధేయపడుతున్నాడు.
ఇవీ చూడండి: గ్రేటర్ వరంగల్ పీఠంపై తెరాస జెండా ఎగరేయాలి: ఎర్రబెల్లి