ETV Bharat / city

ట్రయాంగిల్ లవ్​స్టోరీ.. ఒడిశా టూ ఏపీ.. వయా పోలీసు స్టేషన్! - ఒడిశా యువతిని మోసం చేసిన వ్యక్తి

Triangle Love Story: అతడు స్కూల్ ఏజ్​లోనే ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆ విషయం దాచి మరో అమ్మాయిని ప్రేమించి..పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. ఏడాది గడిచింది.. ఓ పాప పుట్టి సాఫీగా సాగుతున్న సంసారంలోకి మెుదట ప్రేమించిన అమ్మాయి ఎంటర్ అయింది! ఈ విషయం తెలిసిన భార్య.. అతడిని ప్రశ్నించింది. దీంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయి తన తొలి ప్రేయసిని రెండో వివాహం చేసుకున్నాడు. ఈ ట్రయాంగిల్ లవ్​స్టోరీలో బాధితురాలిగా మారిన మొదటి భార్య పోలీసులను ఆశ్రయించింది.

ట్రయాంగిల్ లవ్​స్టోరీ
ట్రయాంగిల్ లవ్​స్టోరీ
author img

By

Published : Jun 19, 2022, 10:14 PM IST

Triangle Love Story: ఒడిశా రాష్ట్రం బర్గర్ జిల్లా గాస్​లర్ బ్లాకులోని దన్బహర్ ప్రాంతానికి చెందిన సుస్మిత మహానంద్.. అదే ప్రాంతానికి చెందిన ఆశిష్ మహానంద్ ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి నాలుగేళ్ల క్రితం పెళ్లి కూడా చేసుకున్నారు. ఏడాదిన్నర క్రితం గుంటూరు జిల్లా దుగ్గిరాలకు మకాం మార్చి స్థానిక కర్మాగారంలో పనిచేస్తూ ఇక్కడే నివాసం ఉంటున్నారు. వారికి రెండేళ్ల పాప ఉండగా.. సుస్మిత రెండోసారి గర్భం దాల్చింది. ఆమె రెండు నెలల గర్భిణీగా ఉండగా.. ఆశిష్ ఒడిశాలో తాను మెుదట ప్రేమించిన అమ్మాయితో ఫోన్లో మాట్లాడుతుండటాన్నిగమనించి ప్రశ్నించింది. దీంతో భార్యాభర్తల మధ్య వివాదం ముదిరి ఆశిష్ ఇంట్లో నుంచి ఒడిశా వెళ్లిపోయాడు. తాను మొదట ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకొని వేరే ప్రాంతంలో కాపురం పెట్టాడు.

గత ఎనిమిది నెలలుగా తన భర్త కోసం సుస్మిత, ఆమె తల్లి వెతుకుతూనే ఉన్నారు. చేసేదిలేక ఒడిశాలోని తమ ప్రాంత పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. నెల క్రితం సుస్మితకు రెండోసారి కాన్పు అయింది. ఇటీవల తన భర్త ఆ యువతితో కలిసి చేబ్రోలు సమీపంలోని దారాల కంపెనీలో పనిచేస్తున్నట్లు తెలుసుకున్న సుశ్మిత.. 10 రోజుల బాలింతగానే దుగ్గిరాల ఠాణాకు వచ్చి ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు ఆశిష్​ను అదుపులోకి తీసుకున్న పోలీసులు దుగ్గిరాలకు తీసుకువచ్చారు. భార్యను వదిలేయటం సరైంది కాదని కౌన్సిలింగ్ ఇచ్చారు. ఏం జరిగిందో తెలియదు కానీ.. సాయంత్రానికి అతన్ని విడిచిపెట్టడంతో చెబ్రోలు వెళ్లిపోయాడు. కాగా.. పోలీసుల తీరుపై సుశ్మిత అసహనం వ్యక్తం చేస్తోంది. అతడిపై ఒడిశాలోనూ కేసు నమోదైందని.. అక్కడి పోలీసులకు అప్పగిస్తే తనకు న్యాయం జరిగేదని వాపోయారు. ఇప్పటికైనా పోలీసులు ఆశిష్​ను అదుపులోకి తీసుకొని తనకు న్యాయం చేయాలని ఆమె కోరుతున్నారు.

ఇదీ చదవండి: 'అది సర్​ప్రైజ్​ అటాక్​.. అభ్యర్థులను కొన్ని శిక్షణ కేంద్రాలు తప్పుదారి పట్టించాయి'

ముస్లిం పెళ్లిలో 'బుల్డోజర్ బరాత్'.. అంతా యోగి మహిమ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.