ETV Bharat / city

200ల మంది సమక్షంలో పెళ్లి చేసుకుందామనుకున్నాడు.. 2 లక్షల ఫైన్​ పడింది - పెళ్లికుమారుడికి రెండు లక్షల జరిమానా

పెళ్లంటే ఆత్మీయల సమక్షంలో ఆనందంగా జరుపుకొనే ఓ వేడుక. ప్రస్తుతం పరిస్థితుల్లో ఇదీ కాస్త అసాధ్యమైన విషయమనే చెప్పాలి. అతి కొద్ది మందితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకునేలా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నిబంధనలను బేఖాతరు చేస్తూ.. ఏకంగా 200 మంది సమక్షంలో వివాహం చేసుకోవాలనుకున్నాడు ఓ వ్యక్తి. మరి ఇంత చేస్తుంటే మన పోలీసులు ఊరుకుంటారా ఏకంగా రెండు లక్షలు ఫైన్​ వేశారు. అసలేమైందంటే..

2 lakhs fine for bridegroom  in srikakulam district
పాతపట్నంలో పెళ్లుకుమారుడికి రెండు లక్షల జరిమానా
author img

By

Published : May 27, 2021, 4:03 PM IST

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం సీది గ్రామానికి చెందిన రాంబాబుకు.. కొవిడ్ నిబంధనలను అనుసరించి 20 మందితో వివాహం నిర్వహించుకునేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. అందుకు విరుద్ధంగా అతను ఏకంగా 200 మంది సమక్షంలో వివాహం చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు.

ఈ విషయంపై పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ కాళీ ప్రసాద్, ఎస్ఐ అమీర్​ఆలీ రాంబాబు ఇంటి వద్దకు వచ్చారు. నిబంధనలను ఉల్లంఘించినందుకు పెళ్లికొడుకు రాంబాబుకు రెండు లక్షల రూపాయల జరిమానా విధించారు. భవిష్యత్తులో ఎవరూ ఇలా నిబంధనలు ఉల్లంఘించవద్దని హెచ్చరించారు.

ఇవీచూడండి: black fungus: తండ్రికి లక్షణాలున్నాయని వదిలివెళ్లిన కుమారుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.