రోడ్డుపై వెళ్తున్న వాహనచోదకులకు ఎలుగుబంటి కనబడటంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఏపీ అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోని పశు వైద్య కళాశాల సమీపంలో హంద్రీనీవా కాలువ పక్కన ఎలుగుబంటి సంచరించింది. అటువైపుగా రోడ్డుపై వెళ్తున్న వాహనచోదకులు దాన్ని చూసి అవాక్కయ్యారు. చాలా మంది నిలబడి చూస్తున్నా.. అది అక్కడి నుంచి కదల్లేదు. చాలాసేపటి తరువాత అక్కడినుంచి వెళ్లిపోయింది.
ఇదీ చదవండి: వరంగల్ పర్యటనలో కడియం శ్రీహరి ఆతిథ్యం తీసుకోనున్న సీఎం కేసీఆర్