రాష్ట్రంలో మరో 917 మంది కరోనా బారిన పడినట్లు వైద్యాశాఖ బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో ఇప్పటి వరకు కొవిడ్ సోకిన వారి సంఖ్య 6,23,510కి చేరింది. మహమ్మారి కోరల్లో చిక్కి మరో 10 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకు మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 3,661కి చేరింది. మరో 1,006 మంది కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 6,06,461 మంది సురక్షితంగా బయటపడ్డారు. ప్రస్తుతం తెలంగాణలో 13,388 యాక్టివ్ కేసులున్నాయి.
తాజా కేసుల్లో.. జీహెచ్ఎంసీ 108, ఆదిలాబాద్ 2, భద్రాద్రి కొత్తగూడెం 52, జగిత్యాల 28, జనగామ 9, జయశంకర్ భూపాలపల్లి 17, జోగులాంబ గద్వాల 1, కామారెడ్డి 5, కరీంనగర్ 66, ఖమ్మం 58, ఆసిఫాబాద్ 5, మహబూబ్నగర్ 19, మహబూబాబాద్ 53, మంచిర్యాల 61, మెదక్ 7, మేడ్చల్ మల్కాజిగిరి 35, ములుగు 18, నాగర్ కర్నూల్ 7, నల్గొండ 71, నారాయణపేట 4, నిర్మల్ 4, నిజామాబాద్ 9, పెద్దపల్లి 39, రాజన్న సిరిసిల్ల 20, రంగారెడ్డి 43, సంగారెడ్డి 7, సిద్దిపేట 29, సూర్యాపేట 57, వికారాబాద్ 7, వనపర్తి 10, వరంగల్ రూరల్ 11, వరంగల్ అర్బన్ 36, యాదాద్రి భువనగిరిలో 19 చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి.