ETV Bharat / city

BRIDGE COLLAPSED: కూలింది పురాతన వారధి.. ప్రయాణికులకు దారేది.? - Sixty year old bridge collapsed

అరవై ఏళ్ల నాటి ఓ వంతెన కుప్పకూలింది. ఈ సమయంలో దానిపై ప్రయాణిస్తున్న 10 టన్నుల కంకర లోడుతో వెళ్తున్న లారీ శిథిలాల మధ్య ఇరుక్కుపోయింది. ఏపీలో కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలంలోని పోల్‌రాజ్‌ కాలువపై ఈ ఘటన చోటుచేసుకుంది.

BRIDGE COLLAPSED
కూలిన పురాతన వంతెన
author img

By

Published : Jul 7, 2021, 2:17 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలంలోని పోల్‌రాజ్‌ కాలువపై ఉన్న 60 ఏళ్ల నాటి వంతెన మంగళవారం కుప్పకూలింది. సామర్థ్యానికి మించి బరువులు వంతెనపై వెళ్లడం వల్ల ఈ ఘటన జరిగింది. పాతకాలం నాటి వంతెన కావడం, ఇక్కడి చేపల చెరువుల వద్దకు తరచూ భారీ వాహనాలు రాకపోకలు సాగించడంతో బ్రిడ్జి బలహీనంగా మారింది.

మంగళవారం ఉదయం 10 టన్నుల కంకర లోడుతో పేరూరు వెళ్తున్న లారీ.. వంతెనపైకి చేరుకోగానే ఒక్కసారిగా బ్రిడ్జి కూలిపోయింది. కూలిన మధ్య భాగంలో లారీ ఇరుక్కుపోయింది. డ్రైవర్‌, క్లీనర్​కు స్వల్ప గాయాలయ్యాయి. పేరూరు, కలవపూడి సత్రం మధ్య రాకపోకలకు, చుట్టుపక్కల గ్రామస్థులు గుడివాడకు వెళ్లడానికి ఈ మార్గం ఎంతో కీలకం. వంతెన కూలడంతో దాకరం, ముదినేపల్లి మీదుగా చుట్టూ తిరిగి వెళ్లాల్సిందేనని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కూలిన పురాతన వంతెన

ఇదీ చదవండి: ACCIDENTS: నిర్లక్ష్యం చిన్నది.. విషాదం అంతులేనిది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.