ETV Bharat / city

తెలంగాణలో మరో ఆరు కరోనా పాజిటివ్​ కేసులు - కోవిడ్ -19 తాజా వార్తలు

రాష్ట్రంలో తొలి కరోనా మరణం నమోదైంది. నాంపల్లికి చెందిన 74ఏళ్ల వృద్ధుడు కరోనా లక్షణాలతో మృతిచెందినట్లు మంత్రి ఈటల తెలిపారు. కాగా నేడు మరో ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికి కరోనా బాధితుల సంఖ్య 65కు చేరింది.

6 more positive cases
మరో ఆరు కరోనా పాజిటివ్​ కేసులు
author img

By

Published : Mar 28, 2020, 7:02 PM IST

రాష్ట్రంలో తొలి కరోనా మరణం నమోదైంది. నాంపల్లికి చెందిన 74ఏళ్ల వృద్ధుడు కరోనా లక్షణాలతో మృతిచెందినట్లు మంత్రి ఈటల తెలిపారు. ఆ వ్యక్తి కుటుంబసభ్యులను అధికారులు హోం క్వారంటైన్‌లో ఉంచారని పేర్కొన్నారు. ఈనెల 14న మతపరమైన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆ వ్యక్తి దిల్లీ వెళ్లారు. 17న ఆ వ్యక్తి తిరిగి హైదరాబాద్​ వచ్చారని చెప్పారు.

మార్చి 20న వ్యక్తికి తీవ్ర జ్వరం ప్రారంభమైంది. శ్వాస తీసుకోవడంలో వ్యక్తికి ఇబ్బంది మొదలైంది. బాధితుడికి సైఫాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించారు. గురువారం రాత్రి వృద్ధుడి ఆరోగ్యం క్షీణించింది. వెంటనే సమీప కార్పొరేట్ ఆస్పత్రికి కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సైఫాబాద్ పోలీసుల సాయంతో మృతదేహాన్ని గాంధీకి తరలించారు. అక్కడి వైద్యులు వృద్ధుడి నమూనాలు పరీక్షలకు పంపించారు. వృద్ధుడి భార్య, కుమారుడిని హోం క్వారంటైన్‌లో ఉంచారు. - మంత్రి ఈటల

మరో ఆరు కరోనా పాజిటివ్​ కేసులు

నేడు ఆరు కేసులు..

రాష్ట్రంలో ఇవాళ ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఈటల ప్రకటించారు. ఇప్పటికి కరోనా బాధితుల సంఖ్య 65కు చేరింది. క్వారంటైన్‌లో ఉన్న వారి సంఖ్య రోజురోజుకూ తగ్గుతోందని ఈటల చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.