ETV Bharat / city

సంక్రాంతి వేళ 4980 ప్రత్యేక బస్సులు - ప్రయాణీకులకు టీఎస్​ఆర్టీసీ తీపి కబురు

పండుగ వేళ ప్రయాణికులకు టీఎస్​ఆర్టీసీ తీపి కబురు వినిపించింది. ఈ నెల 8 నుంచి 14 దాకా... 4980 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు రంగారెడ్డి ఆర్​ఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు సుమారు 3,380 బస్సులు, ఆంధ్రప్రదేశ్​లోని వివిధ ప్రాంతాలకు సుమారు 1,600 బస్సులు నడిపించనున్నారు.

4980 special buses in telangana for sankranthi festival

author img

By

Published : Jan 2, 2021, 7:42 PM IST

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ నెల 8 నుంచి 14 వరకు టీఎస్​ఆర్టీసీ... ప్రత్యేక బస్సులు నడుపనుందని రంగారెడ్డి రీజినల్‌ మేనేజర్ బి వరప్రసాద్‌ వెల్లడించారు. హైదరాబాద్ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు 4980 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్‌ఎం స్పష్టం చేశారు.

మహాత్మా గాంధీ బస్​స్టేషన్, జూబ్లీ బస్​స్టేషస్, సీబీఎస్, ఉప్పల్ క్రాస్​రోడ్, ఎల్బీనగర్, లింగంపల్లి, చందానగర్, ఈసీఐఎల్​, కేపీహెచ్బీ, ఎస్సార్​నగర్, అమీర్​పేట, టెలిఫోన్​భవన్, దిల్​సుఖ్​నగర్​తో పాటు జంట నగరాల్లోని వివిధ శివారు కాలనీల్లో నివసించే వారికి సమీపంలోని ముఖ్యమైన పాయింట్ల నుంచి, అధీకృత టికెట్ బుకింగ్ ఏజెంట్ల వద్ద నుంచి కూడా ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని వరప్రసాద్‌ వివరించారు.

రాష్ట్రంలోని వివిధ జిల్లాలకే కాకుండా ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడ, విజయనగరం, తెనాలి, గుంటూరు, గుడివాడ, రాజమండ్రి, కాకినాడ, రాజోలు, పోలవరం, మచిలీపట్నం, ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, విశాఖపట్నం, శ్రీకాకుళము, భీమవరం, నర్సాపురం, కర్నూల్, అనంతపురం, కడప, చిత్తూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, ఉదయగిరి, కనిగిరి, కందుకూరు, పామూరు, పొదిలి తదితర ప్రాంతాలకు కూడా సంక్రాంతి ప్రత్యేక బస్సులు నగరంలోని వివిధ పాయింట్ల నుంచి సిద్ధంగా ఉంటాయన్నారు.

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు సుమారు 3,380 బస్సులు, ఆంధ్రప్రదేశ్​లోని వివిధ ప్రాంతాలకు సుమారు 1,600 బస్సులు నడిపించనున్నారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అదనపు బస్సుల కోసం అడ్వాన్స్ రిజర్వేషన్ ( www.tsrtconline.in) సౌకర్యంతో ఏర్పాటు చేశామని వరప్రసాద్‌ వివరించారు.

ఇదీ చూడండి: పువ్వాడకు టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ కృతజ్ఞతలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.