ETV Bharat / city

AP Universities: ప్రైవేటు వర్సిటీల్లో కన్వీనర్‌ కోటా సీట్ల పెంపు - private universities updates

ఏపీలో ఉన్నత విద్యలో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు తెస్తోంది. ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో 35 శాతం సీట్లు కన్వీనర్‌ కోటా కింద భర్తీ చేసేలా చర్యలు చేపట్టింది. ఈమేరకు అసరమైన చట్టసవరణపై ఆర్డినెన్స్‌ తెచ్చేందుకు సిద్ధమైంది. ఇక సాధారణ పీజీ కోర్సులకూ ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహించనున్న ప్రభుత్వం.... ఇంజినీరింగ్‌ కళాశాలల్లో యాజమాన్య కోటా రుసుములను కన్వీనర్‌ కోటా కంటే మూడు రెట్లు పెంచనుంది.

convener quota
కన్వీనర్‌ కోటా
author img

By

Published : Jul 11, 2021, 10:01 AM IST

ఆంధ్రప్రదేశ్‌లో ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో 35 శాతం ఇంజినీరింగ్ సీట్లను కన్వీనర్‌ కోటా కింద భర్తీ చేయాలని ఉన్నత విద్యాశాఖ నిర్ణయించింది. మిగతా 65 శాతం సీట్లను యాజమాన్యాలు భర్తీ చేసుకునేందుకు అనుమతి ఇవ్వనుంది. ఇందుకోసం ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్ట సవరణకు ఆర్డినెన్స్‌ తీసుకురానుంది. గత అసెంబ్లీ సమావేశాల్లో చట్ట సవరణకు బిల్లు ప్రవేశపెట్టాలని భావించినా సమయం లేక నిలిపివేసింది. ఇప్పుడు ఆర్డినెన్స్‌ తేవాలని భావిస్తోంది. ప్రైవేటు వర్సిటీల్లో కన్వీనర్‌ కోటా కింద భర్తీచేసే సీట్లకు ప్రత్యేక బోధన రుసుములను ఖరారు చేస్తారు. ఈ కోటాలో సీట్లు పొందిన వారికి విద్యాదీవెన కింద ప్రభుత్వం రుసుములు చెల్లిస్తుంది. 65 శాతం యాజమాన్య కోటా రుసుముల విషయంలో స్వేచ్ఛ ఇవ్వనుంది. రాష్ట్రంలో 5 ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఉండగా... వీటిలో ఇంజినీరింగ్‌తో పాటు సాధారణ డిగ్రీ, వృత్తివిద్యా పోస్టు గ్రాడ్యుయేషన్‌ కోర్సులు ఉన్నాయి.

ఉమ్మడి ప్రవేశపరీక్ష

ఇక సాధారణ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈసారి ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీట్ల భర్తీని ఉన్నత విద్యామండలి చేపట్టనుంది. ఇప్పటివరకు విశ్వవిద్యాలయాలే పరీక్షలు నిర్వహించి సీట్లు భర్తీ చేస్తుండగా... ఈ ఏడాది నుంచి ఏకీకృత విధానం తీసుకురానున్నారు. యాజమాన్య కోటా సీట్లకు ఒక్కో వర్సిటీ ఒక్కో విధానాన్ని అవలంబిస్తున్నాయి. కొన్ని కోర్సులకు 20శాతం, మరికొన్నింటికి 25 శాతం, ఇంకొన్నింటికి 30 శాతం యాజమాన్య కోటా ఉంది. దీన్ని ఏకీకృతం చేస్తూ అన్ని కళాశాలల్లో యాజమాన్య కోటా 30 శాతం చేయనున్నారు. ఈ మేరకు ఉన్నతవిద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్‌ ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసింది. కన్వీనర్‌ కోటా కింద 70శాతం సీట్లను ఉన్నత విద్యామండలి భర్తీ చేస్తుంది.

ప్రభుత్వం తెస్తున్న మార్పులతో ఇంజినీరింగ్‌ కళాశాలల్లో యాజమాన్య కోటా రుసుములు... కన్వీనర్‌ కోటా కంటే మూడు రెట్లు పెరగనున్నాయి. ఉన్నతవిద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్‌ ఆమేరకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ప్రభుత్వం ఆమోదిస్తే ఈ ఏడాదే అమల్లోకి వస్తుంది.

ప్రైవేటు వర్సిటీల్లో కన్వీనర్‌ కోటా సీట్లు పెంపు

ఇదీ చదవండి: Tourist places : రా.. రమ్మని.. పర్యాటక ప్రాంతాలు పిలిచెను ఈ వేళ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.