ETV Bharat / city

'కొత్త' గుబులు: యూకే నుంచి వచ్చిన వారిలో మరో ఇద్దరికి పాజిటివ్​ - కొత్త రకం కరోనా

'కొత్త' గుబులు
'కొత్త' గుబులు
author img

By

Published : Dec 26, 2020, 4:56 PM IST

Updated : Dec 26, 2020, 6:05 PM IST

16:51 December 26

'కొత్త' గుబులు: యూకే నుంచి వచ్చిన వారిలో మరో ఇద్దరికి పాజిటివ్​

యూకే నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో కరోనా కేసులు పెరుగుతున్నాయి.  తాజాగా మరో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ నిర్ధరణ అయినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. తాజా కేసులతో కలిపి యూకే నుంచి వచ్చిన వారిలో మొత్తం 18 మందికి వైరస్​ సోకింది. వీరి ప్రైమరీ కాంటాక్టుల్లో ముగ్గురికి కరోనా సోకినట్లు తెలింది. దీంతో యూకే నుంచి వచ్చిన వారు, వారి ప్రైమరీ కాంటాక్టులు కలిపి మొత్తం 21 మంది వైరస్ బారిన పడ్డారు.  వారిలో నలుగురు హైదరాబాద్ వాసులు కాగా, ఆరుగురు మల్కాజిగిరి, ఇద్దరు జగిత్యాల, మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్‌ అర్బన్ జిల్లాల్లో ఒక్కొక్కరు వైరస్ బారిన పడ్డారు.

యూకే నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో 92 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. హైదరాబాద్‌కు వచ్చి స్వరాష్ట్రాలకు వెళ్లిన వారిని ప్రభుత్వం గుర్తించింది. ప్రయాణికుల వివరాల వారిగా ఆయా రాష్ట్రాలకు సమాచారమిచ్చింది. యూకే నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో ఇంకా 184 మంది సమాచారం అందలేదని ప్రభుత్వం తెలిపింది.

మరో రెండ్రోజుల్లో..

అయితే ఇప్పటి వరకు యూకే నుంచి వచ్చి కొవిడ్ సోకిన వారిలో 'స్ట్రెయిన్​' ఉందా లేదా అనే వివరాలపై సీసీఎంబీ పరిశోధన చేస్తోంది. మరో రెండు  రోజుల్లో ఆ ఫలితాలు వచ్చే అవకాశం ఉందని సమాచారం.  

ఇవీ చూడండి: యూకే నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో 16 మందికి కరోనా

Last Updated : Dec 26, 2020, 6:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.