ETV Bharat / city

110 కోట్ల విలువైన మైత్రి స్థిరాస్తి సంస్థ 210 ఆస్తులు జప్తు!

author img

By

Published : Jun 7, 2022, 7:03 PM IST

గొలుసుకట్టు వ్యాపారం పేరిట మోసాలకు పాల్పడిన మైత్రి స్థిరాస్తి సంస్థ ఆస్తులను ఈడీ తాత్కాలిక జప్తు చేసింది. ఏపీలో 196, తెలంగాణలో 13 భూములు, ప్లాట్లు, ఫ్లాట్లతో పాటు కర్ణాటకలోని ఓ స్థలాన్ని ఈడీ అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

110 crore worth 210 assets of mythri real estates were  attached by ED

గొలుసుకట్టు వ్యాపారం పేరిట మోసాలకు పాల్పడిన మైత్రి స్థిరాస్తి సంస్థ ఆస్తులను ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ తాత్కాలిక జప్తు చేసింది. ఏపీ, తెలంగాణ, కర్ణాటకల్లోని సుమారు 110 కోట్ల రూపాయల విలువైన 210 స్థిరాస్తులను అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. లక్కు కొండారెడ్డి, లక్కు మాల్యాద్రి రెడ్డి, లక్కు మాధవరెడ్డి, కొలికలపూడి బ్రహ్మారెడ్డి గొలుసుకట్టు వ్యాపారం పేరిట మోసాలకు పాల్పడ్డారని అభియోగం. ఏపీ సీఐడీ 2013లో నమోదు చేసిన 12 ఎఫ్ఐఆర్​ల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేసింది.

అనుమతులు లేకుండా ప్రజల నుంచి సుమారు 288 కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. అధిక లాభాలు లేదా ప్లాటు ఇస్తామంటూ గొలుసుకట్టు విధానంలో డిపాజిట్లు సేకరించారని దర్యాప్తు సంస్థ పేర్కొంది. ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్ములో 158 కోట్ల రూపాయలను తిరిగి చెల్లించకుండా మోసం చేసినట్లు వెల్లడించింది. మైత్రి ప్లాంటేషన్ అండ్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ నక్షత్ర బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మంత్రి రియల్టర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఉన్న ఆస్తులను గుర్తించి అటాచ్ చేసింది. ఏపీలో 196, తెలంగాణలో 13 భూములు, ప్లాట్లు, ఫ్లాట్లతో పాటు కర్ణాటకలోని ఓ స్థలాన్ని ఈడీ అటాచ్ చేసింది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.