ETV Bharat / city

'కూల్చేసిన మసీదులు, దేవాలయాల నిర్మాణంపై స్పష్టత ఇవ్వాలి' - adilabad news in telugu

ఆదిలాబాద్​లోని కలెక్టర్​ కార్యాలయం ముందు జమతే ఉల్మా ఏ హింద్​ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. సచివాలయంలో కూల్చేసిన మసీదులు, దేవాలయాల నిర్మాణంపై సీఎం కేసీఆర్​ స్పష్టత ఇవ్వాలని డిమాండ్​ చేశారు.

jamate ulma a hindh protested in adilabad

author img

By

Published : Aug 27, 2020, 7:41 AM IST

సచివాలయంలో కూల్చివేసిన మసీదులు, దేవాలయాల నిర్మాణంపై సీఎం కేసీఆర్​ స్పష్టత ఇవ్వాలని ఆదిలాబాద్​ కలెక్టర్​ కార్యలయం ఎదుట జమతే ఉల్మా ఏ హింద్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ప్లాకార్డులు ప్రదర్శిస్తూ... ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. సచివాలయంలో కూల్చివేసిన రెండు దేవాలయాలపై సీఎం కేసీఆర్​ త్వరగా స్పష్టత ఇవ్వాలని జమతే ఉల్మా ఏ హింద్​ సభ్యులు డిమాండ్​ చేశారు.

ప్రజల్లో ఉన్న సందేహాలను తీర్చాలన్నారు. ప్రార్థనలు మాత్రమే కాదు... కూల్చివేత సందర్భంలో మత పెద్దలను సంప్రదించకపోవడం సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జమతే ఉల్మా ఏ హింద్ సభ్యులు హఫీజ్ అబూబకర్, హఫీజ్ మంజూర్, మౌలానా అసాలం, ముఫ్తీ ముస్తఫా, మౌలానా ఖామర్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: 'ఈటీవీ'కి మహేశ్​ రజతోత్సవ శుభాకాంక్షలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.