ETV Bharat / business

ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్​.. ఆరోస్థానానికి పడిపోయిన బ్రిటన్​ - భారత్​ లేటెస్ట్ న్యూస్

World Biggest Economy Country 2022 : ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని ప్రముఖ ఆర్థిక రంగ నివేదిక సంస్థ బ్లూమ్​బర్గ్​ తెలిపింది. ఐదో స్థానంలో ఉన్న బ్రిటన్​ను కిందకు నెట్టి ఆ స్థానాన్ని ఆక్రమించిందని పేర్కొంది.

World Biggest Economy Country 2022
World Biggest Economy Country 2022
author img

By

Published : Sep 3, 2022, 1:35 PM IST

World Biggest Economy Country 2022 : ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలకు పోటీనిస్తూ టాప్​ 5లోకి దూసుకెళ్లింది భారత్​. ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది​. అంతకుముందు ఐదో స్థానంలో ఉన్న బ్రిటన్​ను కిందకు నెట్టి ఐదో స్థానాన్ని ఆక్రమించింది. అమెరికా డాలర్ల ప్రకారం ఈ అంచనాలను రూపొందించినట్లు ప్రముఖ ఆర్థిక రంగ సంస్థ బ్లూమ్​బర్గ్ తెలిపింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ వెల్లడించిన జీడీపీ వివరాల ప్రకారం.. భారత్​ మొదటి త్రైమాసికంలో తన ఆధిక్యాన్ని పెంచుకుంది. మితిమీరిన జీవన వ్యయంతో సతమతమవుతున్న బ్రిటన్​కు.. ఇది ఎదురుదెబ్బేనని బ్లూమ్​బర్గ్​ తెలిపింది.

అంతకుముందు, అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్​) సైతం.. భారత్​ ఈ ఏడాది చివరకు బ్రిటన్​ను అధిగమిస్తోందని అంచనా వేసింది. ప్రస్తుతం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాల జాబితాలో.. అమెరికా తొలిస్థానంలో ఉండగా.. చైనా, జపాన్, జర్మనీ, భారత్​, బ్రిటన్​ తరువాతి స్థానాల్లో ఉన్నాయని ఐఎంఎఫ్​ వెల్లడించింది. దశాబ్దం కింద భారత్​ 11 స్థానంలో ఉండగా.. బ్రిటన్​ ఐదో స్థానంలో ఉంది.

బ్రిటన్​లో రాజకీయ సంక్షోభం కారణంగా కొత్త ప్రధానమంత్రిని ఎన్నుకోనున్నారు. దీంతో ప్రదాని పదవి కోసం విదేశాంగ సెక్రటరీ లిజ్​ ట్రస్​తో పోటీపడుతున్నారు మాజీ ఛాన్సలర్​ రిషి సునాక్​. ఆర్థిక మాంద్యం తలెత్తిన తరుణంలో కొత్తగా ఎన్నికయ్యే ప్రధానమంత్రి వీటిని ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఈ ఆర్థిక మాంద్యం 2024 మే వరకు కొనసాగుతుందని బ్యాంక్​ ఆఫ్​ ఇంగ్లాండ్​ అంచనా వేసింది. మరోవైపు ఈ ఏడాది భారత్​ ఏడు శాతం మేర తన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోనుందని పేర్కొంది.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలవుతున్న తరుణంలో.. భారత స్టాక్ మార్కెట్లు లాభాల్లో పయనిస్తున్నాయి. ఎమ్​ఎస్​సీఐ ఎమర్జింగ్​ మార్కెట్ల సూచీలో భారత్ రెండో స్థానంలో ఉంది. రెండో త్రైమాసింకలో బ్రిటన్ జీడీపీ ఒక శాతం మాత్రమే పెరిగింది. ఈ ఏడాది భారత కరెన్సీతో పోలిస్తే.. పౌండ్​ విలువ ఎనిమిది శాతం పడిపోయిందని తెలిపింది.

ఇవీ చదవండి: ఐటీ రిఫండ్​ జమ అయిందా? ఆ డబ్బుతో ఏం చేస్తున్నారు?

'రూ.5 కోట్లకు మించి జీఎస్టీ ఎగవేస్తే అధికారులే నేరుగా విచారించొచ్చు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.