Upcoming Bike Launches In 2024 : యువతకు బైక్‌లంటే ఎంత క్రేజో చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ప్రముఖ టూ-వీలర్ కంపెనీలు అన్నీ ఎప్పటికప్పుడు తమ లేటెస్ట్ మోడల్ బైక్‌లను మార్కెట్లోకి తేవడానికి ప్రయత్నిస్తుంటాయి. అందులో భాగంగానే రాయల్ ఎన్ఫీల్డ్, బజాజ్, యమహా, అప్రిలియా లాంటి టాప్ బ్రాండెడ్ కంపెనీలు త్వరలో తమ సూపర్ మోడల్ బైక్‌లను ఇండియాలో లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. అందుకే వాటిపై మనమూ ఓ లుక్కేద్దాం రండి.
1. Royal Enfield Himalayan 450 Features : ఇటలీలో నిర్వహించిన 2023 EICMA షోలో రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450 బైక్‌ను ప్రదర్శించడం జరిగింది. ఈ నవంబర్ 24న దీని ధరను ప్రకటించనున్నారు. త్వరలోనే ఈ బైక్ భారత్‌లో లాంఛ్ అయ్యే అవకాశం ఉంది.
ఈ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450 బైక్‌లో బ్రాండ్ న్యూ 452సీసీ సింగిల్-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ DOHC ఇంజిన్‌ను అమర్చారు. ఇది గరిష్ఠంగా 40.02 PS పవర్, 40 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ ట్రాన్స్మిషన్ అనుసంధానం కలిగి ఉంటుంది. దీనిలో ఫుల్ ఎల్ఈడీ లైటింగ్, టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ విత్ నావిగేషన్, డ్యూయెల్ ఛానల్ ABS సిస్టమ్, స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్, 43mm అప్‌సైడ్-డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్, మోనోషాక్ రియర్ సస్పెన్షన్ ఉన్నాయి. అలాగే బైక్ ముందు భాగంలో 21 అంగుళాల స్పోక్డ్ వీల్, వెనుక భాగంలో 17 అంగుళాల స్పోక్డ్ వీల్ ఉంటాయి. ఈ బైక్‌లో ప్రత్యేకంగా స్ల్పిట్ సీట్స్, వైడ్ హ్యాండిల్ బార్, 17 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటాయి.
2. Aprilia RS 457 Features : ఈ అప్రిలియా ఆర్ఎస్ 457 బైక్ ప్రీ-బుకింగ్స్ కొన్ని వారాల క్రితమే ప్రారంభమయ్యాయి. ఈ బైక్‌లను మహారాష్ట్రలోని బారామతి ప్లాంట్‌లో తయారు చేస్తున్నారు. ఈ అప్రిలియా బైక్‌లో 457సీసీ Parallel ట్విన్-సిలిండర్ ఇంజిన్ అమర్చారు. ఇది 47 PS పవర్, 48.8 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. మహారాష్ట్రలో తయారవుతున్న ఈ బైక్‌ను గ్లోబల్ మార్కెట్స్‌లోనూ విక్రయించనున్నారు. అప్రిలియా ఆర్ఎస్ 457 బైక్ ధర రూ.3.8 లక్షలు (ఎక్స్-షోరూం)గా ఉంది.
3. Bajaj Pulsar NS 400 Features : బాజాబ్ కంపెనీ 2024 రెండో త్రైమాసికంలో బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 400 బైక్ లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ బైక్‌లో డోమినార్ 400, ఓల్డ్ 390 డ్యూక్ బైక్‌ల్లో వాడిన 373 సీసీ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్నే అమర్చారు. బజాజ్ NS సిరీస్‌లో భాగంగానే ఈ నయా బైక్‌ను తీసుకురానున్నారు.
4. Yamaha YZF R3 Features : యమహా కంపెనీ డిసెంబర్లో YZF-R3 బైక్‌ను పరిచయం చేయనుంది. ఈ బైక్‌లో 321 సీసీ Parallel ట్విన్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనుసంధానంతో పనిచేస్తుంది. ఈ యమహా YZF-R3 బైక్ నేరుగా KTM RC 390, అప్రిలియా RC 457, BMW G310 RRలతో పోటీపడనుంది.
5. Yamaha MT 03 Features : యమహా కంపెనీ డిసెంబర్లోనే MT-03 బైక్‌ను కూడా పరిచయం చేయనుంది. ఈ బైక్‌లోనూ 321 సీసీ Parallel ట్విన్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనుసంధానంతో పనిచేస్తుంది. ఈ యమహా MT-03 బైక్ నేరుగా KTM 390డ్యూక్, టీవీఎస్ అపాచీ RTR 310, హోండా CB 300Rలతో పోటీ పడుతుంది.
ఇకపై ప్రతి కారులోనూ ADAS మస్ట్ - కేంద్రం కొత్త రూల్ - మరి ధరలు పెరుగుతాయా?