Ujjwala Yojana Free Gas Cylinder : దేశ ప్రజలకు కేంద్రం శుభవార్త తెలిపింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన- పీఎమ్‌యూవై రెండో దశ కింద మరో 75 లక్షల ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. 2026 వరకు కొనసాగే రెండో దశ ఉజ్వల యోజన పథకం కోసం 1650 కోట్లను కేటాయించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఉజ్వల 2.0లో భాగంగా లబ్ధిదారులకు మొదటి రీఫిల్, స్టవ్‌ను ఉచితంగా అందజేస్తామని మంత్రి వెల్లడించారు.
-
Following the decision to reduce the LPG prices by ₹200, Cabinet has approved the extension of #PMUY for the release of 75 lakh LPG connections, with a total financial implication of ₹1650 crore.
— Anurag Thakur (@ianuragthakur) September 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
It will cover households that were earlier left behind or new households formed… pic.twitter.com/9wjlk5fr5E
">Following the decision to reduce the LPG prices by ₹200, Cabinet has approved the extension of #PMUY for the release of 75 lakh LPG connections, with a total financial implication of ₹1650 crore.
— Anurag Thakur (@ianuragthakur) September 13, 2023
It will cover households that were earlier left behind or new households formed… pic.twitter.com/9wjlk5fr5EFollowing the decision to reduce the LPG prices by ₹200, Cabinet has approved the extension of #PMUY for the release of 75 lakh LPG connections, with a total financial implication of ₹1650 crore.
— Anurag Thakur (@ianuragthakur) September 13, 2023
It will cover households that were earlier left behind or new households formed… pic.twitter.com/9wjlk5fr5E
ప్రస్తుతం పీఎమ్యూవైలో భాగంగా 14.2 కిలోల సిలిండర్‌పై ఏడాదికి 12 రీఫిళ్ల వరకు రూ.200 చొప్పున సబ్సిడీ (Ujjwala Yojana Subsidy Amount) అందిస్తున్నారు. ఈ కొత్త కనెక్షన్లతో.. ఉజ్వల పథకం కింద మొత్తం లబ్ధిదారుల సంఖ్య 10.35 కోట్లకు చేరుతుంది. అయితే దేశంలో చాలా మందికి ఇంకా ఎల్పీజీ కనెక్షన్ లేదని కేంద్రం ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే జానాభా పెరుగుతుండటం, వివాహాలు, వలసలు వంటి కారణాల వల్ల కొత్త కుటుంబాలు ఏర్పడుతున్నాయి. 2023 ఆగస్టు 31 నాటికి దేశంలో దాదాపు 15 లక్షల పీఎమ్‌యూవై కనెక్షన్ల కోసం డిమాండ్ ఏర్పడింది.
మోదీకి కేబినెట్ అభినందనలు..
Union Cabinet Meeting : జీ20 శిఖరాగ్ర సదస్సును విజయవంతం చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీని అభినందిస్తూ కేంద్ర కేబినెట్ తీర్మానాన్ని ఆమోదించిందని వెల్లడించారు అనురాగ్. ఈ తీర్మానాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రవేశపెట్టగా.. మంత్రులంతా ఏకగ్రీవంగా ఆమోదించారని చెప్పారు. జీవ ఇంధన కూటమి (Global Biofuel Alliance) ఏర్పాటు సహా ఆఫ్రికా యూనియన్‌ను జీ20 కూటమిలో చేర్చుకోవడం వంటి అంశాలలో ప్రధాని మోదీ సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం సాధించడం యావత్ దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. ఈ-కోర్టు ప్రాజెక్టులో భాగంగా ఫేజ్-3 కింద రూ. 7,210 కోట్ల వెచ్చించేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపిందని వెల్లడించారు. అన్ని కోర్టు కాంప్లెక్స్‌లలో 4, 400 ఈ-సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
-
Promoting empowerment through digitalisation and improving access to justice, Phase 3 of eCourts project, with a financial outlay of ₹ 7210 crore, has been approved by the cabinet under the leadership of Hon'ble PM Shri @narendramodi ji.
— Anurag Thakur (@ianuragthakur) September 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
It will provide 4400 eSewa kendras on… pic.twitter.com/boHs60y1Lw
">Promoting empowerment through digitalisation and improving access to justice, Phase 3 of eCourts project, with a financial outlay of ₹ 7210 crore, has been approved by the cabinet under the leadership of Hon'ble PM Shri @narendramodi ji.
— Anurag Thakur (@ianuragthakur) September 13, 2023
It will provide 4400 eSewa kendras on… pic.twitter.com/boHs60y1LwPromoting empowerment through digitalisation and improving access to justice, Phase 3 of eCourts project, with a financial outlay of ₹ 7210 crore, has been approved by the cabinet under the leadership of Hon'ble PM Shri @narendramodi ji.
— Anurag Thakur (@ianuragthakur) September 13, 2023
It will provide 4400 eSewa kendras on… pic.twitter.com/boHs60y1Lw
G20 Leaders Praises Bharat : భారత్‌పై జీ20 నేతల ప్రశంసలు.. సదస్సు నిర్వహణ అద్భుతమని కితాబు
Modi Bilateral Talks : దేశాధినేతలతో మోదీ బిజీబిజీ.. కెనడా ప్రధానితో 'ఖలిస్థానీ' నిరసనలపై చర్చ