Top 5 Turbo Petrol Cars Under 15 Lakh : పండగ సమయంలో చాలా మంది కొత్త కార్లు కొంటుంటారు. వీరిని దృష్టిలో ఉంచుకుని పలు కార్ల కంపెనీలు.. ఇప్పటికే దీపావళి సేల్‌ను ప్రారంభించాయి. పైగా భారీ ఆఫర్లను కూడా ప్రకటించాయి. మీరు కూడా కారు కొనాలనే ప్లానింగ్‌లో ఉన్నారా? అయితే రూ.15లక్షల బడ్జెట్లోని బెస్ట్ కార్లపై ఓ సారి లుక్కేద్దాం రండి.
హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్..
Hyundai I20 N Line : హ్యుందాయ్ కంపెనీ ఈ కారును 2021లో మార్కెట్లోకి విడుదల చేసింది. అనంతరం ఒక ఫేస్‌లిఫ్ట్ మోడల్ని కూడా కంపెనీ విడుదల చేసింది. హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్ కారు 1.0 లీటర్ TGDi ఇంజిన్ సామర్థ్యంతో రూపుదిద్దుకుంది. ఇది 118bhp పవర్, 172Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఆరు మాన్యువల్ గేర్లు, ఏడు గేర్ల డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ యూనిట్.. ఇంజిన్‌కి అనుసంధానంగా ఉంటాయి. ఈ కారు రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది.
Hyundai I20 N Line Price : హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్ కారు ధర రూ.9.99 లక్షలు (ఎక్స్‌షోరూం)గా ఉంది.
![Hyundai I20 N Line](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/28-10-2023/19873094_best_petrol_cars_under_15_lakhs-3.jpg)
మహీంద్రా XUV300 టర్బోస్పోర్ట్..
Mahindra XUV300 TurboSport : ఈ కారు 2022 అక్టోబర్‌లో మార్కెట్లోకి విడుదలైంది. 1.2 లీటర్ mStallion TGDi ఇంజిన్ సామర్థ్యంతో ఈ కారు తయారు చేసింది మహీంద్రా కంపెనీ. ఈ ఇంజిన్ 128bhp పవర్, 250Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఆరు మాన్యువల్ గేర్లు ఈ ఇంజిన్‌కు అనుసంధానమై ఉంటాయి. కేవలం 10.67 సెకన్లలోనే గంటకు 100 కిలోమీటర్ల స్పీడ్‌ను ఈ కారు అందుకోగలదని సమాచారం. హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్ కారు మొత్తం నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.
Mahindra XUV300 TurboSport Price : మహీంద్రా ఎక్స్‌యూవీ300 టర్బోస్పోర్ట్ కారు ప్రారంభ ధర రూ.9.30 లక్షలు (ఎక్స్‌షోరూం)గా ఉంది.
![Mahindra XUV300 TurboSport](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/28-10-2023/19873094_best_petrol_cars_under_15_lakhs-214.jpg)
హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్..
Hyundai Venue N Line : 1.0 లీటర్ త్రీ-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను ఈ కారులో అమర్చారు. ఇది 118bhp పవర్, 172Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ కారు ఇంజిన్‌కు ఆరు గేర్లు అనుసంధానమై ఉంటాయి. హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్ కారు రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది.
Hyundai Venue N Line Price : హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్ కారు ధర రూ.12.08 లక్షలు (ఎక్స్‌షోరూం)గా ఉంది.
![Hyundai Venue N Line](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/28-10-2023/19873094_best_petrol_cars_under_15_lakhs-524.jpg)
మారుతి సుజుకి ఫ్రాంక్స్..
Maruti Suzuki Fronx : ఈ మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారులో 1.0 లీటర్ త్రీ-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ అమర్చారు. ఇది 99bhp పవర్, 147Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఇంజిన్‌కు ఐదు మాన్యువల్ గేర్లు, ఆరు ఆటోమెటిక్ గేర్లు అనుసంధానమై ఉంటాయి.
Maruti Suzuki Fronx Price : మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారు ధర రూ.9.72 లక్షలు (ఎక్స్‌షోరూం)గా ఉంది.
![Maruti Suzuki Fronx](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/28-10-2023/19873094_best_petrol_cars_under_15_lakhs-2.jpg)
సిట్రోయెన్ C3..
Citroen C3 : 1.2 లీటర్ త్రీ-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ సామర్థ్యంతో సిట్రోయెన్ కారు రూపుదిద్దుకుంది. ఈ ఇంజిన్ 109 bhp పవర్, 190Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ ఇంజిన్‌తో ఆరు మాన్యువల్ గేర్లు అనుసంధానమై ఉంటాయి.
Citroen C3 Price : సిట్రోయెన్ C3 ధర రూ.8.28 లక్షలు (ఎక్స్‌షోరూం)గా ఉంది.
![Citroen C3](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/28-10-2023/19873094_best_petrol_cars_under_15_lakhs-23.jpg)
Car Subscription Model : కారు కొనకుండా హ్యాపీగా తిరగాలా?.. సబ్స్క్రిప్షన్ ఆప్షన్ గురించి తెలుసా?