వారాంతపు సెషన్లో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. తీవ్ర ఒడుదొడుకుల అనంతరం.. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 980 పాయింట్లు పతనమై 59,845 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి నిఫ్టీ 320 పాయింట్లు తగ్గి 17,806 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 30 ప్యాక్‌లో టైటాన్ మినహా మిగతా కంపెనీల షేర్లన్నీ నష్టాల్లోకి వెళ్లిపోయాయి.
అంతర్జాతీయ మార్కెట్లలోని భారీ నష్టాలు సూచీలపై ప్రతికూల ప్రభావం చూపాయి. కొవిడ్ భయాల వల్ల మార్కెట్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మరోవైపు అమెరికాలో సెలవుల సీజన్ కావడం వల్ల విదేశీ మదుపర్ల కొనుగోళ్లు నెమ్మదించాయి. పైగా ఏడాది ఆఖరు కావడం వల్ల సూచీలకు దన్నుగా నిలిచే ఎలాంటి పరిణామాలూ లేవు. మరోవైపు దిగ్గజ షేర్లలో అమ్మకాలు సూచీలను కిందకు లాగాయి.
ఆసియాలోని సియోల్, టోక్యో, షాంఘై, హాంకాంగ్‌లలో ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లోనే ముగిశాయి.
రూపాయి విలువ..
అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 7 పైసలు దిగజారి 82.86 వద్ద నిలిచింది.