భారీ లాభాలు..
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలమైన సంకేతాలు, రూపాయి పుంజుకోవడం వంటి కారణాల వల్ల దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్ ఉదయం 57,506.65 పాయింట్ల వద్ద భారీ లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో 58,099.94 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 1276.66 పాయింట్ల లాభంతో 58,065.47 వద్ద ముగిసింది. 17,147.45 వద్ద ప్రారంభమైన నిఫ్టీ 386.95 పాయింట్లు ఎగబాకి 17,274.30 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 17,287.30 వద్ద గరిష్ఠాన్ని తాకింది.
సెన్సెక్స్ 30 షేర్లలో పవర్‌గ్రిడ్, డాక్టర్ రెడ్డీస్, సన్‌ఫార్మా మాత్రమే నష్టపోయాయి. ఇండస్‌ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్, బజాజ్‌ఫిన్‌సర్వ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా స్టీల్, ఎల్‌అండ్‌టీ, విప్రో, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, ఇన్ఫోసిస్ రాణించిన షేర్లలో ఉన్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.81.52 వద్ద నిలిచింది.